Konda Polam : ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత మెగాసెన్సేషన్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న
రెండవ చిత్రం `కొండపొలం` పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన యాక్షన్ మరియు అడ్వెంచరస్ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. తాజాగా కొండపొలం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మూవీకి సెన్సారు వారు ఎలాంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు సినిమా చూసి మేకర్స్ ను ప్రశంసించారు. కొండపొలం 2:15గంటల పర్‌ఫెక్ట్ రన్‌టైమ్‌తో ప్రేక్షకులముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ భాగం షూట్ చేశారు. ఈ సినిమాని అడవుల్లో ఏకధాటిగా 40 రోజులు షూటింగ్ తో పూర్తి చేశారని తెలుస్తోంది.
సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండ పొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందించగా.. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. శ్రవణ్ కటికనేని దీనికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :