Etharkkum Thunindhavan: తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఈతర్క్కుమ్ తునింధవన్’. చాలా కాలం తరువాత వరుస విజయాలను అందుకుంటున్నాడు సూర్య. ఆమధ్య సూర్య నటించిన సినిమాలు వరుసగా విడుదలైనప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇక అదే సమయంలో లేడీ డైరెక్టర్ సుధ కొంగరు దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా అనే సినిమా చేసాడు. ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలై ఆమంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సూర్య మరోసారి తన నటనతో కట్టిపడేశాడు. ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా జై భీమ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ఓటీటీ వేదికగానే విడుదలైంది. వస్తావా సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఇప్పుడు ‘ఈతర్క్కుమ్ తునింధవన్’ సినిమాతో అలరించడానికి రెడీ అయ్యాడు సూర్య. ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈసినిమాలో సూర్య సరసన అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమానుంచి ఓ అందమైన లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఇమాన్ స్వరపరిచిన సంగీతం ఆకట్టుకుంది. యుగభారతి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను ప్రదీప్ కుమార్ .. వందన శ్రీనివాసన్ … బృంద ఆలపించారు.ఏఈ పాటలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించారు సూర్య. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ప్రియాంక తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెరలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. ఇప్పుడు ప్రియాంక నటిస్తున్న మొదటి పెద్ద సినిమా సూర్యదే.. ఈ సినిమా హిట్ అయితే ఈ అమ్మడుకి కెరీర్ ఊపందుకోవడం ఖాయం.
మరిన్ని ఇక్కడ చదవండి :