బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ కాలని సిబ్లాక్ లో తన ఇంట్లో ఫ్యాన్ కు ఊరివేసుకోని సూసైడ్ చేసుకుంది. కన్నడ సినీరంగానికి చెందిన శోభిత కన్నడతోపాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. శోభిత ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలరించారు. బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శోభిత.. గతేడాదే వివాహం చేసుకున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత.. ఇప్పుడు తన భర్త సుధీర్ తో కలిసి శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది శోభిత. సీరియల్స్ మాత్రమే కాకుండా తెలుగులో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాలో నటించింది. శోభిత సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని బెంగుళూరు తరలించనున్నట్లు సమాచారం. ఆమె మృతి పట్ల సినీ, సీరియల్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.