Trivikram -NTR Movie : ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురం’ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకున్నారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. తన నెక్ట్స్ సినిమాను ఎన్టీఆర్‌తో తీయబోతున్న గురూజీ..ప్రస్తుత కోవిడ్ సమయంలో మూవీ స్క్రిప్ట్ పై కసరత్తలు చేస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం త్రివిక్రమ్ రూ. 20 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల త్రివిక్రమ్ తీసిన ‘అల వైకుంఠపురం’ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపి..ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది. దీంతో ఆటోమేటిక్‌గా ఆయన రెమ్యూనరేషన్ పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చిత్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన రెమ్యూనరేషన్‌లో కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో మూవీ ప్రకటించినప్పటి నుంచి సినిమా కథ గురించి విభిన్న రకాల రూమర్స్ సర్కులేట్ అవుతున్నాయి. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను ఈ మూవీకి ఫిక్స్ చేసినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎన్నారైగా కనిపిస్తారని..తొలిసారి ఇండియాకు వచ్చి, ఆ తరవాత జరిగిన పరిస్థితుల వల్ల రాజకీయాల్లోకి వెళ్లాల్సి వస్తుందని కథపై రూమర్లు వచ్చాయి. తాజాగా ఈ సినిమా కథ ఒక పురాతన పాడుబడిన కోట చుట్టూ తిరుగుతుందని మరో టాక్ నడుస్తోంది. ఆ కోటలోని గుప్త నిధుల చుట్టూ స్టోరీ నడుస్తుందని వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజమో వేచి చూడాలి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Read More : సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్