AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram Srinivas: మహేష్, బన్నీ తర్వాత త్రివిక్రమ్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడా..?

సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ప్రస్తుతం గురూజీ పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే దర్శకుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. గతంలో మహేష్ గురూజీ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.

Trivikram Srinivas: మహేష్, బన్నీ తర్వాత త్రివిక్రమ్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడా..?
Trivikram Srinivas
Rajeev Rayala
|

Updated on: May 28, 2023 | 8:16 AM

Share

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాల్లో తెలియని మ్యాజిక్ ఉంటుంది. సినిమా కథతో పాటు మాటలను కూడా మనసుకు తాకేలా రాసి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ప్రస్తుతం గురూజీ పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే దర్శకుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. గతంలో మహేష్ గురూజీ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. మహేష్ తో ఈసారి మాస్ మసాలా ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ ఈ సినిమా టైటిల్ ను మరికొద్ది  రోజులు అనౌన్స్ చేయనున్నారు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ వరుసగా సినిమాలు చేయనున్నాడు.

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయనున్నారు అని టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ అదిరిపోయే స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్రభాస్ త్రివిక్రమ్ కాంబో మూవీని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట.

మహేష్ సినిమా పూర్తయిన వెంటనే.. అల్లు అర్జున్ సినిమాను పూర్తి చేయనున్నారట గురూజీ.. ఆ వెంటనే ప్రభాస్ సినిమాను పట్టాలెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కాలంటే చాలా టైం పడుతుంది. ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యే సరికి త్రివిక్రమ్ కూడా తన సినిమాలు పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సిఉంది.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..