మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అలాగే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ సెట్ లో అడుగుపెట్టాడు చిరు. ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ తో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ హంగులతో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం సుమారు 13 సెట్స్ ను తీర్చిదిద్దింది చిత్రయూనిట్. ఈ సెట్స్ లోనే చాలా వరకు విశ్వంభర సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఇందులో నటించే నటీనటులు, హీరోయిన్ ఎవరనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ఇప్పటివరకు అనుష్క, మృణాల్ ఠాకూర్, కాజల్ అగర్వాల్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వీరిలో ఎవరనే విషయం మాత్రం స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇందులో త్రిషను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంద. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది త్రిష. ఇటీవలే లియో సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.
పొన్నియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష క్రేజ్ మారిపోయింది. ఇందులో మరింత అందంగా కనిపించి మెప్పించింది. దీంతో ఆమెకు మళ్లీ అవకాశాలు క్యూ కట్టాయి. విజయ్ దళపతి జోడిగా దాదాపు 13 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి నటించింది. మలయాళంలో మోహన్‌లాల్‌తో రామ్‌తో జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళంలో కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తుంది.
A LEGEND RISES 🔮🔥
MEGASTAR @KChiruTweets sets his foot into the mighty world of #Vishwambhara ❤🔥
Shoot in Progress.
In cinemas 10th Jan 2025 🌠@DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota @mayukhadithya @sreevibes @gavireddy_srinu @UV_Creations pic.twitter.com/Qrzvlsuv5b
— UV Creations (@UV_Creations) February 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.