Trisha Krishnan: పొన్నియిన్ సెల్వన్‌తో బౌన్స్ బ్యాక్.. కానీ ఆ కోరిక మాత్రం తీరటం లేదు

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 96 సినిమాలో నటించిన త్రిష హీరోయిన్‌గా బిగ్ హిట్ అందుకున్నారు. కథ పరంగా ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ లాగే కనిపించినా... త్రిషకు జోడిగా విజయ్‌ సేతుపతి నటించటంతో ఫుల్ క్రెడిట్ త్రిష ఖాతాలోకి రాలేదు.

Trisha Krishnan: పొన్నియిన్  సెల్వన్‌తో బౌన్స్ బ్యాక్..  కానీ ఆ కోరిక మాత్రం తీరటం లేదు
Trisha Krishnan

Updated on: May 10, 2023 | 1:23 PM

పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యారు సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌. వెండితెర మీద హీరోయిన్‌గా సుధీర్ఘ కెరీర్‌ కంటిన్యూ చేస్తున్న ఈ బ్యూటీకి, ఒక్క కల మాత్రం నెరవేరటం లేదు. పొన్నియిన్ సెల్వన్‌ ప్రమోషన్స్‌లో త్రిష లుక్స్ చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఏజ్‌లోనూ త్రిష గ్లామర్‌కు ఫిదా అయ్యారు. దీంతో వరుసగా స్టార్ హీరోల సినిమాలకు త్రిష డేట్స్‌ను లాక్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నారు. అయితే హీరోయిన్‌గా ఇంత బిజీగా ఉన్నా.. త్రిష అసలు కోరిక మాత్రం ఇది కాదు. గత ఏడేళ్లుగా వెండితెర మీద లేడీ ఓరియంటెండ్ సినిమాతో సత్తా చాటాలని కష్టపడుతున్నారు ఈ చెన్నై బ్యూటీ. 2016 లో రిలీజ్ అయిన నాయకీ సినిమాతో ఫస్ట్ టైమ్ లేడీ ఓరియంటెడ్ మూవీ చేశారు త్రిష. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత చేసిన మోహిని కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది.

కాస్త ట్రెండ్ మార్చి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 96 సినిమాలో నటించిన త్రిష హీరోయిన్‌గా బిగ్ హిట్ అందుకున్నారు. కథ పరంగా ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ లాగే కనిపించినా… త్రిషకు జోడిగా విజయ్‌ సేతుపతి నటించటంతో ఫుల్ క్రెడిట్ త్రిష ఖాతాలోకి రాలేదు. రీసెంట్‌గా రాంగీ సినిమాతో మరో ప్రయోగం చేశారు త్రిష. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మరో లేడీ ఓరియంటెడ్ సినిమాను రెడీ చేస్తున్నారు ఈ బ్యూటీ. ది రోడ్ పేరుతో పాన్ ఇండియా యాక్షన్ రోడ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా అయిన త్రిష కల నెరవేరుస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..