Trisha Krishnan: ఎనిమిదేళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో కలిసి నటిస్తున్న త్రిష..

|

Sep 14, 2023 | 9:36 AM

అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోను మెప్పించింది. ఇక తెలుగులో సినిమాలు తగ్గించింది. మొన్నామధ్య ఆచార్య సినిమాలో నటిస్తుందని టాక్ వచ్చింది అలాగే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం త్రిష తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు భాగాలుగా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Trisha Krishnan: ఎనిమిదేళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో కలిసి నటిస్తున్న త్రిష..
Trisha
Follow us on

త్రిష.. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించింది. యంగ్ అండ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే తమిళ్ లోను సినిమాలు చేసింది. అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోను మెప్పించింది. ఇక తెలుగులో సినిమాలు తగ్గించింది. మొన్నామధ్య ఆచార్య సినిమాలో నటిస్తుందని టాక్ వచ్చింది అలాగే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం త్రిష తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు భాగాలుగా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమాలో నటిస్తున్నారు త్రిష. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిష ఓ కొత్త సినిమాను ఓకే చేసిందని తెలుస్తోంది. లోకనాయకుడు కమల్ హాసన్ సరసన త్రిష నటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియాన్ 2 సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.