TOP 9 ET: వెయ్యి కోట్ల బిజినెస్ ఒక్క అనౌన్స్‌మెంట్‌తో ఆగింది | ఉస్తాద్‌పై ‘చంద్రబాబు’ నో ఎఫెక్ట్.
చాలా రోజుల గ్యాప్ తర్వాత సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. అలా పవన్ జాయిన్ అయ్యారో లేదో.. వెంటనే మళ్లీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్ వేడెక్కాయి. దాంతో ఉన్నపలంగా చేస్తున్న షూట్ ఆపేసి.. పవన్ విజయవాడ వెళ్లిపోయారు. అయితే తాజాగా మళ్లీ ఆయన సెట్స్‌లో జాయిన్ అయ్యారని తెలుస్తుంది.
1.Usataad
చాలా రోజుల గ్యాప్ తర్వాత సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. అలా పవన్ జాయిన్ అయ్యారో లేదో.. వెంటనే మళ్లీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్ వేడెక్కాయి. దాంతో ఉన్నపలంగా చేస్తున్న షూట్ ఆపేసి.. పవన్ విజయవాడ వెళ్లిపోయారు. అయితే తాజాగా మళ్లీ ఆయన సెట్స్‌లో జాయిన్ అయ్యారని తెలుస్తుంది.
02.Salaar
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్ కారణంగా.. కోట్లతో బిజినెస్ అగిందంటూ.. తాజాగా ఫిల్మ్ ట్రెడర్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. సలార్ సెప్టెంబర్ 28కే రిలీజ్ అయ్యేదని.. ఆ సినిమాతో ఇండియన్ సినిమాస్ మార్కెట్లో దాదాపు కోట్లలో బిజినెస్ జరిగేదని.. వారంటున్నారు. దాంతో పాటే.. వెయ్యికోట్ల కలెక్షన్ మార్క్‌ను టచ్ చేసి ఇండియన్ సినిమా స్థాయిన పెంచేదని.. వారు తమ పోస్టులో కోట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్ట్ పోన్ అనౌన్స్‌మెంట్ అఫీషియల్ గా రిలీజ్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో వారీ కామెంట్స్ చేస్తున్నారు.
03.Ram Charan
మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన పారిస్‌లో సందడి చేశారు. దుబాయ్ బేస్డ్ కంపెనీ ‘ఆర్‌ఆర్ అండ్ కో’ ఫౌండర్ రోజ్ మిన్ ఇచ్చిన పార్టీలో పాల్గొన్నారు చెర్రీ. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు రామ్‌చరణ్.
04.Skanda
రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా స్కంద. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం బుక్ మై షో యాప్‌లో 100K ఇంట్రెస్ట్‌లను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ సలార్ సినిమాలు మాత్రమే ఈ ఫీట్ అందుకోగా.. ఇప్పుడు స్కంద వాటి సరసన చేరింది. సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.
05. Leo
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న లియో సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే తమిళనాడులో విడుదలకు ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 18న పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. బెనిఫిట్ షోలకు అనుమతులు లేకపోవడంతో టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 19న దసరా సందర్భంగా సినిమా విడుదల కానుంది.
06.Hanuman
తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సోఫియో ఫాంటసీ హనుమాన్. ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌కు రెస్పాన్స్ అదిరిపోయింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. వినాయక చవితి పండుగ నుంచి ప్రమోషన్స్ మొదలు కానున్నాయి.
07.Varun Tej
గాండీవధారి అర్జున రిలీజ్ తరువాత బ్రేక్ తీసుకున్న వరుణ్ తేజ్ నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటికే పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా సినిమాను ఎనౌన్స్ చేసిన మెగా ప్రిన్స్, అక్టోబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో ఉన్నారు వరుణ్.
08.Trisha
విజయ్‌తో లియో కంటే ముందే మరో సినిమాతో వస్తున్నారు త్రిష. ఈమె హీరోయిన్‌గా నటిస్తున్న ది రోడ్ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ సినిమా. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఇప్పటి వరకు హిట్ కొట్టని త్రిష.. ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలని చూస్తున్నారు.
09.Goutami
ఒకప్పుడు హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసిన గౌతమి.. ఇప్పుడు అమ్మ పాత్రలకు పరిమితమయ్యారు. తాజాగా ఈమెకు చెందిన రూ.25 కోట్లు విలువైన భూమి కబ్జాకు గురైనట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆమె గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి.. భూమి కబ్జాకు సంబంధించిన ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని తన కుమార్తె పేరు మీద రాసేందుకు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆళగప్పన్ ను సంప్రదించానని.. ఆ సందర్భంలో ఆయన తనను మోసం చేసినట్లుగా వాపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..