
త్రిష కృష్ణన్.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఈ బ్యూటీ .


తెలుగులో సూపర్ హిట్ కొట్టడానికి త్రిష ఎక్కువ సమయం తీసుకోలేదు.ప్రభాస్ నటించిన 'వర్షం' సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.

ఇటీవలే విజయ్ సేతుపతి నటించిన 96సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది త్రిష

త్రిష కెరియర్ లో 60 కు పైగా సినిమాలు చేసింది ఇప్పటి వరకు వాటిలో 65 పైగా నామినేషన్స్ లో 50 కు పైగా అవార్డ్స్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది.

రజనీకాంత్ .. కమల హాసన్ .. చిరంజీవి .. మోహన్ లాల్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించింది త్రిష.

నేడు త్రిష పుట్టిన రోజు.. సోషల్ మీడియా వేదికగా త్రిషకు అభిమానులు, సినిమా తారలు శుభాకాక్షలు తెలుపుతున్నారు.