కొట్టాం రా హిట్..! వీరభద్రుడు సినిమాకు సూపర్ రెస్పాన్స్.. థియేటర్‌లో రచ్చ రచ్చ చేసిన డైరెక్టర్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతనికి తమిళంలోనే కాదు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. కాగా సూర్య నటించిన లేటెస్ట్ సినిమా ‘కరుప్పు( తెలుగులో వీరభద్రుడు) శుక్రవారం (మే15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

కొట్టాం రా హిట్..! వీరభద్రుడు సినిమాకు సూపర్ రెస్పాన్స్.. థియేటర్‌లో రచ్చ రచ్చ చేసిన డైరెక్టర్
Rj Balaji

Updated on: May 15, 2026 | 6:00 PM

స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కరుప్పు ( వీరభద్రుడు). ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు హీరో సూర్య. దాంతో ఈ సినిమాపై సూర్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సూర్య ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. వీరభద్రుడు సినిమా విడుదలైన అన్ని ఏరియల్లో మంచి టాక్ అందుకుంది. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. విడుదలకు ముందే వచ్చిన టీజర్స్, గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి : నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్జే బాలాజీ దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ఇక ఇప్పుడు ఆర్జే బాలాజీ దర్శకుడిగా మరో సక్సెస్ అందుకున్నాడు. దర్శకత్వం మాత్రమే కాదు ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించారు బాలాజీ. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా హిట్ అవ్వడంతో, సూర్య ఫ్యాన్స్ మాత్రమే కాదు దర్శకుడు కూడా ఆనందంలో తేలిపోతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఆర్జే బాలాజీ థియేటర్స్ లో రచ్చ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : OTT Movie : IMDB 7.4 రేటింగ్‌.. వణికిస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఏకంగా ఆరు ఓటీటీల్లో

థియేటర్ లో సినిమా చూసిన దర్శకుడు బాలాజీ ఎమోషనల్ అయ్యారు. ఆడియన్స్ సినిమా చూసి ఎంజాయ్ చేయడంతో ఆర్జే బాలాజీ ఆనందం కట్టలు తెంచుకుంది. గట్టిగా అరుస్తూ.. హిట్ కొట్టిన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే పక్కనే ఉన్న హీరోయిన్ త్రిషకు హగ్ ఇచ్చాడు బాలాజీ. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై సూర్య ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నాని జెర్సీ సినిమా గుర్తొచ్చింది అంటున్నారు నెటిజన్స్. కాగా ఈ సినిమా తెలుగులోనూ మంచి టాక్ తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి : Siddarth: నా సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి.. కానీ నన్ను పట్టించుకోలేదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us