Mahesh Babu: ఎస్ఎస్ఎంబీ 29పై విజయేంద్రప్రసాద్ కామెంట్స్.. మహేష్‌ను అందుకే ఎంచుకున్నారట..

ప్రస్తుతం ఆయన రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినే షన్లో రాబోతున్న చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉండనుందని

Mahesh Babu: ఎస్ఎస్ఎంబీ 29పై విజయేంద్రప్రసాద్ కామెంట్స్.. మహేష్‌ను అందుకే ఎంచుకున్నారట..
Mahesh Babu, Rajamouli
Follow us

|

Updated on: Dec 03, 2022 | 7:47 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలిసింది అనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు జక్కన్న రూపొందించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్. చత్రపతి, విక్రమార్కుడు, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేశాయి. అయితే రాజమౌళి టేకింగ్ పై హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలకు స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో.. స్క్రిప్ట్ కూడా అంతే ముఖ్యం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు స్టోరీ అందిస్తున్నారు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఈగ, బజరంగీ భాయిజాన్, బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి హిట్ చిత్రాలకు స్టోరీస్ అందించారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినే షన్లో రాబోతున్న చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉండనుందని గతంలో విజయేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ తో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ సినిమా కోసం జక్కన్న మహేష్ ను ఎంచుకోవడానికి గల కారణాలు రివీల్ చేశారు.

తాజాగా రాజమౌళి సినిమాలో మహేష్ నుంచి ఎలాంటి స్పెషల్ ఎలిమెంట్స్ ఎక్స్ పెక్ట్ చేయవచ్చని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చారు. మహేష్ బాబు చాలా ఇంటెన్స్ యాక్టర్. అతను నటించిన సినిమాల్లోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూస్తే ఎంతో ఇంటెన్స్ గా ఉంటాడో.. ఎంత అగ్రెసివ్ గా నటిస్తాడో తెలుస్తుంది. అది ఏ రచయితకైనా కూడా అడ్వాంటేజ్ ఎలిమెంట్. మహేష్ ఏ పాత్రలోకైనా సులభంగా షిఫ్ట్ కాగలడని.. ఇది ప్రతి రచయిత పనిని సులభం చేస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక అనంతరం రాజమౌళి గురించి మాట్లాడుతూ.. చాలా కాలంగా నా కొడుకు అడవిలో సాహసం వంటి సినిమా చేయాలనుకున్నాడు. కానీ అతనికి ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు ఇలాంటి స్టోరీకి మహేష్ బాబు బెస్ట్ ఎంపిక అని అతను భావించాడు. అతని పాత్రకు తగినట్టుగా స్టోరీ రాయడం ప్రారంభించాము అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. ఈసినిమాను వచ్చే ఏడాది మే లేదా జూన్ నుంచి రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో