ANIL KUMAR POKA

కడుపులో బిడ్డ.. అయినా షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.!

27 April 2024

బాలీవుడ్ దీపికా పడుకోణె హీరోయిన్ గా స్టార్ రేంజ్ ఉన్న ఆమె కష్టపడే తత్వానికి హీరోస్ సైతం ఫిదా అవుతున్నారు.

దీపికా పడుకోణె పోలీస్‌ పాత్రలో నటిస్తున్న సినిమా సింగం ఎగైన్‌. శక్తి శెట్టి పాత్రలో నటిస్తున్నారు దీపిక.

ఈ సినిమాలో పనిచేస్తున్న హీరోలకు సమానంగా గట్టి పోటీ ఇస్తూ యాక్షన్‌ సీక్వెన్స్  చేస్తున్నారు దీపిక మేడం.

ఈమె హార్డవర్క్ పై ఈ మూవీ కెప్టెన్ రోహిత్‌ శెట్టి కూడా కామెంట్స్ చేసాడు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.

రీల్‌ అయినా, రియల్‌ అయినా, ఈమె నా రియల్‌ హీరో లేడీ సింగం అని దీపిక పోస్టర్‌ని రివీల్‌  చేశారు డైరక్టర్‌ రోహిత్‌ శెట్టి.

ఇంతవరకు బనే ఉంది.. కన్సీవ్‌ అవ్వగానే.. కాలు కిందపెట్టకుండా రెస్ట్ తీసుకునే అమ్మాయిలున్న ఈ రోజుల్లో..

హీరోయిన్ దీపిక మాత్రం.. షూటింగ్స్‌లో కష్టపడుతూ, ప్రొడ్యూసర్లకు ఇచ్చిన కమిట్మెంట్‌ను కాదనకుండా పని చేస్తుంది.

తన అప్‌కమింగ్ సినిమాలను ఫినిష్ చేసే ప్రయత్నంలో ఓ పక్క విమర్శలతో పాటు.. చప్పట్లు కొట్టించుకుంటోంది దీపికా.