
‘సలార్’ సినిమా సక్సెస్ అయినప్పటి నుంచి ప్రభాస్ సినిమాల పై ఆసక్తి మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన ఖాతాలో ఒకటి రెండు కాదు ఎన్నో భారీ సినిమాలు ఉన్నాయి. ‘కల్కి 2898 AD’ ఈ ఏడాది విడుదల కానుంది. ఇప్పుడు ‘సలార్ 2’, ‘స్పిరిట్’, ‘రాజా సాబ్’ సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నాయి. ఈ మూడు చిత్రాలను ఇప్పటికే ప్రకటించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత, డార్లింగ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ‘స్పిరిట్’ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారని ఇటీవల ప్రకటించారు. అయితే ఇంతలో, ప్రభాస్ మూడవ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇది ‘సలార్ 2’ లేదా ‘స్పిరిట్’ సినిమాల గురించి కాదు. ఇది ప్రభాస్ ‘ది రాజా సాబ్’ గురించి. జనవరి 15న ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది.
ఈ సినిమాను దర్శకుడు మారుతితెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే రివీల్ చేశారు. ఇందులో ప్రభాస్ లుంగీ కట్టుకుని కనిపించాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇది కూడా భారీ VFX చిత్రం అవుతుందట. ఇటీవలే ప్రభాస్ ‘కల్కి 2898 AD’ స్పెషల్ డ్యాన్స్ నంబర్ కోసం టీమ్‌తో కలిసి ఇటలీలో వెళ్లారు. దిశా పటానీతో కలిసి ఓ స్పెషల్ డ్యాన్స్ సీక్వెన్స్ చేయబోతున్నాడు మన డార్లింగ్. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన ‘ది రాజా సాబ్’ సినిమాని స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. జూన్ లేదా జూలైలో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేస్తే 2025 సంక్రాంతి కానుకగా భారీగా విడుదల చేయనున్నారు.
‘రాజా సాబ్’ హారర్-కామెడీ చిత్రం. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహన్, నిధి అగర్వాల్, బ్రహ్మానందం కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా దర్శకుడు మారుతికి చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. దాంతో ఇప్పుడు ప్రభాస్ సినిమాతో భారీ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా’స్పిరిట్’ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. 100 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రూపొందుతోందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.