Pallavi-Vijayashanti: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సాయిపల్లవి విరాట పర్వం(Virataparvam) సినీ ప్రమోషన్స్ సమయంలో కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కాశ్మీర్ పండిట్లపై దాడులను.. గోరక్షకుల దాడులతో పోల్చుతూ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పటికే సాయి పల్లవిపై భజరంగ్‌దళ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాజాసింగ్ వంటి వారు తీవ్రంగా ఖండించారు. ఇదే విషయంపై టాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ నేత విజయశాంతి స్పందించారు.
పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయని విజయశాంతి ట్వీట్ చేశారు. పవిత్ర గోవుల హత్యలను ఖండించడాన్ని కాశ్మీరీ మారణహోమంతో పోల్చవద్దని విజయశాంతి అన్నారు. ఒక్క సారి ఆలోచిస్తే రెండూ సంఘటనలు ఒకేలా ఉండవని అర్థమవుతోందని అన్నారు. అంతేకాదు ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం…. తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? అంటూ విజయశాంతి ప్రశ్నించారు.
కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని…. గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) June 16, 2022
సమస్యలపై ఎవరికైనా అవగాహన లేకుంటే.. వాటిపై వ్యాఖ్యానించడాని నిరాకరిస్తూ.. అటువంటి అంశాలకు దూరంగా ఉండాలని విజయశాంతి అన్నారు. నేటి ప్రపంచంలో సమాజంలో ప్రభావం చూపించే వ్యక్తులు తాము మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు విజయశాంతి.
ఏది ఏమైనా ఆ సినిమా ఆర్ధిక లాభాలతో ఆసక్తి ఉన్న నిర్మాణ సంబంధితులు, కశ్మీర్ ఫైల్స్ పోలిక తెచ్చి, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో ఆ కథానాయికను సమస్యల్లోకి లాగినట్టుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం కూడా అందుతోంది. pic.twitter.com/rw3SED4p9d
— VIJAYASHANTHI (@vijayashanthi_m) June 16, 2022
“సాయి పల్లవి తాజా సినిమా (విరాట పర్వం) ఆర్థిక ప్రయోజనాలను పొందే విధంగా కాశ్మీర్ ఫైల్స్‌పై పోలిక తెచ్చి.. ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలని ఈ సమస్యలోకి సాయిపల్లవిని లాగినట్లు.. ఇలాంటి వివాదాస్పద ప్రకటనల ద్వారా సంచలనం సృష్టించి.. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారని కూడా వినికిడి” అని విజయశాంతి అభిప్రాయపడ్డారు.
ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం…. తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా?
— VIJAYASHANTHI (@vijayashanthi_m) June 16, 2022
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..