నారప్ప మూవీ షూటింగ్ పార్ట్‌ని కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు హీరో వెంకటేష్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియమణి హీరోయిన్. మే 14న రిలీజ్ కాబోతోంది నారప్ప సినిమా.
కార్తీ, రష్మిక జోడీగా నటించిన సుల్తాన్ మూవీ టీజర్ రిలీజైంది. మహాభారతాన్ని యుద్ధం లేకుండా ఊహించుకోండి అనే థీమ్‌తో సాగే మూవీ ఇది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సుల్తాన్ మూవీని భాగ్యరాజ్ కన్నన్ డైరెక్ట్ చేస్తున్నారు.
రవితేజ హీరోగా వస్తున్న అప్‌కమింగ్ మూవీ ఖిలాడీ కాస్టింగ్ అంతకంతకూ బలపడుతూనే వుంది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఖిలాడీలో నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ వచ్చింది. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఇప్పటికే యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు.
విశాల్ నటిస్తున్న చక్ర మూవీ రిలీజ్ డేట్‌ని లాక్ చేసుకుంది. ఈనెల 19న నాలుగు సౌతిండియన్ లాంగ్వేజెస్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చక్ర మేకర్స్. డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంతో వస్తున్న చక్ర మూవీలో రెజీనా, శ్రద్ధా శ్రీనాధ్ ఫిమేల్ లీడ్స్‌లో నటిస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్ మూవీ జూన్ 4న రిలీజ్ కాబోతోంది. ప్రస్థానం ఫేమ్ దేవ్‌కట్టా డైరెక్ట్ చేస్తున్న రిపబ్లిక్.. సోషియో పొలిటికల్ మూవీగా రాబోతోంది. ఇందులో ఐశ్వర్యారాజేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఎఫ్3 మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. లేటెస్ట్‌గా ఫన్‌తో కూడిన కొన్ని ఫ్యామిలీ ఎపిసోడ్స్ చిత్రీకరణ షురూ అయినట్లు అనౌన్స్ చేశారు. వెంకటేష్, తమన్నాతో పాటు.. కొందరు సీనియర్ ఆర్టిస్టులు ఈ షెడ్యూల్‌లో పార్టిసిపేట్ చేస్తారు.
ఇప్పటికే నాలుగు హిందీ సినిమాల్లో నటిస్తున్న రకుల్.. తాజాగా డాక్టర్‌జీ అనే క్యాంపస్ కామెడీ డ్రామాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అనుభూతి కాశ్యప్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా.. మెడికల్ స్టూడెంట్ పాత్రలో నటిస్తారు రకుల్.
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో రాబోయే మూవీ.. ప్రిరిలీజ్ బిజినెస్ ఆశాజనకంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. నైజామ్, వైజాగ్ హక్కులు 20 కోట్లు పలుకుతోంది. ఈ కాంబోలో గత రెండు సినిమాలూ హిట్ కావడంతో బీబీ3పై బజ్ పెరిగింది. మే 28న రిలీజ్ కాబోతోంది బీబీ3.
కేసిరీస్ మూవీ ఫ్యాక్టరీ బేనర్‌పై క్రిష్ బండిపల్లి నిర్మించిన ‘రావణలంక’ మూవీ టీజర్‌ని ఆవిష్కరించారు మంత్రి హరీష్‌రావు. బిఎన్‌ఎస్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మురళీశర్మ, దేవ్‌గిల్, క్రిష్, అష్మిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.