Singer Varam: ఇండస్ట్రీకి దొరికిన వరం.. ఆమె పాడితే అలా వింటూ ఉండిపోవాల్సిందే

వారం వారం యూట్యూబ్ లో కొత్త సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక వైపు సినిమా సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంటే మరో వైపు ఫోక్ సాంగ్స్ రిలీజ్ అయ్యి దుమ్మురేపుతున్నాయి. తాజాగా ఓ ఫోక్ సింగర్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది.

Singer Varam: ఇండస్ట్రీకి దొరికిన వరం.. ఆమె పాడితే అలా వింటూ ఉండిపోవాల్సిందే
Singer Varam

Updated on: Jun 04, 2026 | 9:01 PM

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ సందడి కనిపిస్తుంది. యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్ నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా పాటలను మించి జానపదగీతాలు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. నెలకు రెండు మూడు సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొన్ని జానపద గీతాలు పాన్ ఇండియా రేంజ్ లో విజయాలను అందుకుంటున్నాయి. విదేశాల్లోనూ మన ఫోక్ సాంగ్స్ తెగ సందడి చేస్తున్నాయి. సాంగ్స్ మాత్రమే కాదు ఫోక్ సింగర్స్ కూడా అంతే పాపులర్ అయ్యారు. వారిలో సింగర్ వరం ఒకరు. అసలు పేరు వరలక్ష్మీ.. కానీ అందరూ వరం అంటూ పిలుస్తుంటారు. తన అందమైన గొంతుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సింగర్ వరం.. ఫోక్ సాంగ్స్ తో పాటు సినిమా సాంగ్స్ కూడా ఆలపించారు సింగర్ వరం.

ముఖ్యంగా సింగర్ వరం పాడిన ఫోక్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమా సాంగ్స్ విషయానికొస్తే  విరాటపర్వం, మ్యాడ్, ఇస్మార్ట్ శంకర్, ఆచార్య, నారప్ప సినిమాల్లో పాటలను పాడి మెప్పించారు వరం. సినిమాల్లో కూడా తన పాటలతో అభిమానులను అలరించిన వరం.. ఎక్కువగా ఫోక్ సాంగ్స్ తోనే పాపులర్ అయ్యారు. మహాబాబుబాబాద్ జిల్లా , కే సముద్రం మండలం బేరువాడ వరం సొంతవూరు.

వరం నాలుగేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. వరం చిన్నతనం నుంచి పాటలు పాడాలని, గాయని అవ్వాలని కలలు కన్నారు. ఆ కలలను సాకారం చేసుకుంటూ సినిమా పాటలు పాడే స్థాయికి చేరుకున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పాటలతో అలరిస్తుంది వరం. సోషల్ మీడియాలో వరంకు మంచి అభిమానులు ఉన్నారు. తాజాగా వరం పాడిన తెలంగాణ పాట అందరిని ఆకట్టుకుంటుంది. ఊపిరి పీల్చుకోలుకుండా అం అర్ఘళంగా పాటను ఆలపించి అందరిని ఆశ్చర్యపరిచింది వరం. ఈ బ్రీత్ లెస్ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

సింగర్ వరం సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us