స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతగా జీవితాన్ని గడపాలని చూస్తుంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తోంది సమంత. వెకేషన్స్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ.. మానసికంగా స్ట్రాంగ్ కావడానికి ప్రయత్నిస్తుంది సామ్. ఇదంతా కలలా ఉంది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది సామ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.