Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కొంచెం సేపటి క్రితం టాలీవుడ్ నటుడు తరుణ్ హైదరాబాద్ లోని ఈడి కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నేపథ్యంలో హీరో తరుణ్ ఈడీ కార్యాలయంలో అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన పై తరుణ్‌ను ఈడీ ప్రశ్నించనుందని సమాచారం. 2017 లో ఎక్సైజ్ శాఖ విచారణ సైతం ఎదుర్కొన్నాడు తరుణ్.
2017 జూలై 19 స్వచ్ఛంద ఎక్సైజ్ శాఖ కు బయో శాంపుల్స్ కూడా తరుణ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తరుణ్ ఇచ్చిన బయో శాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ చార్జ్ షీట్ లో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది. తాజాగా మరోసారి కెల్విన్ ఇచ్చిన వివరాలపై తరుణ్ ను విచారించనున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఎఫ్ లాంజ్ క్లబ్ కు కెల్విన్ తో ఉన్న సంబంధాలపైనా ఈడీ ఆరా తీసే అవకాశం ఉంది.
డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు సినిమా తారలను ఈడీ అధికారులు విచారించారు. డ్రగ్స్ వ్యవహారంలో జరిగిన లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేపట్టిన విచారణ చివరిదశకు వచ్చినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే అధికారులు టాలీవుడ్ ప్రముఖులు పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, రవితేజ, నవదీప్‌ను విచారించిన విషయం తెలిసిందే. రోజుకి ఒకరిని కార్యాలయానికి పిలిచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న విషయంపై అధికారులు కూపీ లాగుతున్నారు.
Read also: Hyderabad: హైదరాబాద్‌లోని టోలీచౌకీలో దారుణ హత్య..