Oke Oka Jeevitham: శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్ లుక్ రిలీజ్..!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. తొలినుంచి సరికొత్త కథలకు ప్రాధాన్యం ఇస్తూ కెరీర్ లో ముందుకుసాగుతున్నాడు. ఆయన సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ ఉంటుందనే అభిప్రాయం ఉంటుంది.

Oke Oka Jeevitham: శర్వానంద్ ఒకే ఒక జీవితం ఫస్ట్ లుక్ రిలీజ్..!
Sharwanand Oke Oka Jeevitham First Look

Updated on: Jun 28, 2021 | 7:12 PM

Oke Oka Jeevitham: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. తొలినుంచి సరికొత్త కథలకు ప్రాధాన్యం ఇస్తూ కెరీర్ లో ముందుకుసాగుతున్నాడు. ఆయన సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ ఉంటుందనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో ఆచీతూచీ అడుగులు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ఒకే ఒక జీవితం’ అంటూ తన 30వ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసి, అభిమానులకు సర్ ప్రైజ్ అందించాడు. పల్లెటూరికీ.. పట్టణానికి మధ్య హీరో లైఫ్ ఎలా సాగింది? ఆయనకు ఎదురుపడ్డ సంఘటనలు ఏంటి? ఇలాంటి పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమాను శ్రీ కార్తీక్ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించనుంది. అలాగే అమల అక్కినేని ఓ కీలక పాత్రలో కనిపించనుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి లాంటి వారు ప్రముఖ పాత్రలు పోషింస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు అజయ్ భూపతి డైరెక్షన్ లో ‘మహాసముద్రం’ అనే సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా సీరియస్ డ్రామాగా సాగనుంది. ఇందులో బొమ్మరిల్లు ఫేం సిద్ధార్ద్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి తోనూ శర్వా ఓ మూవీలో నటించనున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఈమేరకు అనిల్ స్టోరీ వినిపించాడని.. శర్వానంద్ కూడా ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, శర్వానంద్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానున్నట్లు తెలుస్తోంది.

Also read:

Roja Selvamani: ఘనంగా నటి రోజా కొడుకు పుట్టినరోజు వేడుకలు.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్..

Vignesh Shivan: ప్రతి ఒక్కటీ మొదలయ్యేది బాత్రూంలోనే..! నయన్ ఎక్కడుంటే.. అదే నా బెస్ట్ ప్లేస్: విఘ్నేశ్ శివన్