ఫస్ట్ బాలీవుడ్ అవార్డు అందుకున్న ప్రభాస్

2019 ఆగష్టు 30న విడుదలైన 'సాహో' మూవీ బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. రిలీజ్‌ అయిన తొలిరోజే బాలీవుడ్‌లో సైతం కలెక్షన్ల వర్షం కురించి.. రూ.150 కోట్లు వసూలు చేసింది. దీంతో బాలీవుడ్ బిజినెస్ అవార్ట్స్ 2019కి గానూ..

ఫస్ట్ బాలీవుడ్ అవార్డు అందుకున్న ప్రభాస్

Edited By:

Updated on: Feb 21, 2020 | 9:35 PM

‘బాహుబలి’ సినిమాతో దేశ వ్యాప్తంగా.. ఫేమస్‌ అయిన ప్రభాస్.. ఆ తర్వాత మరోసారి ‘సాహో’తో మళ్లీ క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగులో ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి గానూ ఫస్ట్ బాలీవుడ్ అవార్డు సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 2019 ఆగష్టు 30న విడుదలైన ‘సాహో’ మూవీ బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. రిలీజ్‌ అయిన తొలిరోజే బాలీవుడ్‌లో సైతం కలెక్షన్ల వర్షం కురించి.. రూ.150 కోట్లు వసూలు చేసింది. దీంతో బాలీవుడ్ బిజినెస్ అవార్ట్స్ 2019కి గానూ.. ‘హైయ్యెస్ట్ గ్రాసింగ్ మెయిల్ డెబ్యూ అవార్డును’ సొంతం చేసుకున్నాడు ప్రభాస్.

సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం నార్త్ ఆడియన్స్‌కి బాగానే కనెక్ట్ అయింది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. సాహో సినిమా కోసం బాగా కష్టపడ్డాడు ప్రభాస్. ఈ సినిమా కోసం హిందీ నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పాడు. కాగా.. ప్రస్తుతం ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు 130 కోట్ల రూపాయలతో.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా వస్తోంది.