Megastar Chiranjeevi: చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ మరో బృహత్కార్యానికి శ్రీకారం.. రేపటి నుంచి సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్

|

Apr 21, 2021 | 5:38 AM

Megastar Chiranjeevi: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలానికి ప్రజల జన జీవనం అస్తవ్యస్తమైంది. అనేక రంగాలపై ఆర్థికంగా ప్రభావం చూపించింది...

Megastar Chiranjeevi: చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ మరో బృహత్కార్యానికి శ్రీకారం.. రేపటి నుంచి సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్
Chiranjeevi
Follow us on

Megastar Chiranjeevi: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలానికి ప్రజల జన జీవనం అస్తవ్యస్తమైంది. అనేక రంగాలపై ఆర్థికంగా ప్రభావం చూపించింది. సామాన్యులను ఆదుకోవడానికి ఆర్ధికంగా చేయూత ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. అనేకమంది సెలబ్రెటీలు ముందుకొచ్చారు. కరోనా , లాక్ డౌన్ సమయంలో ఆదుకున్నారు..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని కార్మికులను కరోనా లాక్ డౌన్ సమయంలో ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేశారు. సినీ కార్మికులకు అండగా నిలబడ్డారు.. అయితే తాజాగా సీసీసీ మరో బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 45 ఏళ్లు వయసున్న సినీ కార్మికులకు, సినీ జర్నలిస్ట్‌లకు అపోలో ఆసుపత్రి సౌజన్యంతో వ్యాక్సిన్‌ తీసుకునే అవకాశాన్ని సీసీసీ ఏర్పాటు చేసింది.

ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా ఓ వీడియో ద్వారా చెప్పారు. రేపటి నుంచి (ఏప్రిల్ 22 గురువారం) నుంచి నెల రోజులపాటు ఈ వ్యాక్సిన్‌ అందజేయనున్నామని తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం 24 శాఖల యూనియన్‌ల్లో పేరు నమోదు చేసుకుని అందరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని… షెడ్యూల్‌ వారీగా అపోలో ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ పొందాలని సూచించారు. అయితే కార్మికునితో పాటు.. వారి జీవిత భాగస్వామి కూడా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని చిరంజీవి తెలిపారు. అంతేకాకుండా మూడు నెలలపాటు ఉచితంగా డాక్టర్‌లను సంప్రదించవచ్చని, మందులు కూడా రాయితీతో పొందవచ్చని మెగాస్టార్‌ పేర్కొన్నారు.

Also Read: చిత్ర పరిశ్రమలో ఆగని కరోనా కల్లోలం..బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ ఆరోగ్య పరిస్థితి విషమం..