టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ వేగవంతం చేసింది ఈడీ. ఈ కేసులో భాగంగా ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను విచారించిన సంగతి తెలిసిందే. ఈరోజు హీరోయిన ఛార్మిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం ఛార్మి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఛార్మి తో పాటు విచారణకు ఆమె చార్టెడ్ అకౌంటెంట్ సతీష్ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఈడీ కార్యాలయం ముందు ఛార్మి బౌన్సర్లు హంగామా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రైవేట్ బౌన్సర్స్‌ను ఛార్మి నియమించుకున్నారు. దాదాపు 15 మంది బౌన్సర్లు ఈడీ కార్యాలయం ఉండడం గమనార్హం.. ఈరోజు ఛార్మి బ్యాంక్ అకౌంట్స్‌ను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. డ్రగ్స్ కేసులో ప్రశ్నలు సంధించడంతో పాటు బ్యాంక్ లావాదేవీల వివరాలపై ఆరా తీయనున్నారు ఈడీ అధికారులు.
అటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్‌గా మారడంతో పలువురు టాలీవుడ్ నటీనటుల పేర్లు బయటకి వచ్చాయి. కెల్విన్ సెల్ ఫోన్ లో సినిమా వాళ్ళ పేర్లను గుర్తించిన అధికారులు. ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు. ఛార్మి పేరుని దాదా పేరుతో కెల్విన్ సేవ్ చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. దాదా పేరుతో ట్రాన్సాక్షన్స్ గుర్తించారు ఈడీ అధికారులు. మరికాసేపట్లో విచారణ మొదలు పెట్టనున్నారు. ఇవాళ ఛార్మిపై ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది ? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మాతలుగా కొన్ని సినిమాలు నిర్మించారు. దీంతో ఇద్దరి బ్యానర్లకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఛార్మి తనకు సంబంధించిన రెండు బ్యాంక్ అకౌంట్స్ వివరాలను ఈడీ అధికారులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 2015 నుంచి 2018 వరకు ట్రాంజక్షన్స్ వివరాలను ఈడీ అధికారులకు ఛార్మి ఇచ్చినట్లుగా సమాచారం.
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ.. ఈరోజు ఈడీ ముందుకు హీరోయిన్ ఛార్మి..