SS Rajamouli: ‘నేను ఆయనకు పెద్ద అభిమానిని’.. లెజెండరీ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళిని ఘనంగా సత్కరించిన మంత్రి హరీష్‌

|

Jun 11, 2023 | 4:03 PM

టాలీవుడ్‌ లెజెండరీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిని మంత్రి హరీశ్‌రావు ఘనంగా సత్కరించారు. బంజారాహిల్స్‌లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు, డైరెక్టర్‌ రాజమౌళి ఆదివారం (జూన్‌ 11)..

SS Rajamouli: నేను ఆయనకు పెద్ద అభిమానిని.. లెజెండరీ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళిని ఘనంగా సత్కరించిన మంత్రి హరీష్‌
SS Rajamouli
Follow us on

టాలీవుడ్‌ లెజెండరీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిని మంత్రి హరీశ్‌రావు ఘనంగా సత్కరించారు. బంజారాహిల్స్‌లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు, డైరెక్టర్‌ రాజమౌళి ఆదివారం (జూన్‌ 11) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ఆయనను ఘనంగా సత్కరించారు. ఆస్కార్ సాధించినందుకు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. ‘బాహుబలి మువీతో తెలుగు జాతి ఖ్యాతిని రాజమౌళి దేశవ్యాప్తం చేశారు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌తో మన ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా చేశారు. రాజమౌళి సినిమాల్లో దేశ భక్తి, సామాజిక స్పృహ కనిపిస్తుంది. ఆయన భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు’ హరీష్ అన్నారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. హరీశ్‌రావు నేతృత్వంలో సిద్ధిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. హరీశ్‌రావు పనితీరు చూసిన నాటి నుంచి ఆయనకు తాను వీరాభిమానినయ్యానంటూ రాజమౌళి ప్రశంసించారు.

కాగా భారతీయ సినీ చరిత్రలో తొలిసారి బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా ‘నాటు నాటు..’ ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా జరిగిన 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్ఆర్‌ఆర్‌ మువీలోని ‘నాటు నాటు..’ సాంగ్‌ ఆస్కార్‌ దక్కించుకుంది. పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీగా విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబ్టటి, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.