చదువుకునే స్థోమత లేక మధ్యలోనే చదువును వదిలేస్తున్నారు కొందరు పిల్లలు. అలాగే సరైన సమయానికి వైద్యం దొరకక ఎంతో మంది మరణిస్తున్నారు.ఇలా చైల్డ్ ఎడ్యుకేషన్ , ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ కోసం రకాలుగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు సేవలందిస్తుంది ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ. మరింత మంది బాధితులకు చేయూత నివ్వడానికి ముందుకు వచ్చిన ఈ సంస్థను సపోర్ట్ చేయడానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ లు ముందుకు వచ్చారు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎలైట్ మీడియా ఆడియన్స్ కు విన్నూతనమైన కొన్సెప్టుతో స్టార్స్ తో కలసి ఆడేందుకు అవకాశం కలిపిస్తున్నారు.. శ్రీకాంత్,తరుణ్ లతో ఆడాలి అనుకున్నవారు బిడ్డింగ్ లో పాల్గొని విన్ అవ్వాలి. ఆతర్వాత యూనివర్సల్ XL జట్టులో సభ్యులు అవుతారు. ఆ తరువాత అమెరికాలోని డల్లాస్ లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ తో బిడ్డింగ్ ద్వారా సెలెక్ట్ అయిన యూనివర్సల్ XL టీం పోటీపడుతారు.
ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చారిటీకి డొనేట్ చేయనున్నారు. ఈ మ్యాచ్ కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ జట్టు సభ్యులు తమన్ ,సుధీర్ బాబు, ప్రిన్స్, భూపాల్ తో పాటు ఈస్ట్ వెస్ట్ సభ్యులు,ఎలైట్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. క్రికెట్ అంటే మా అందరికీ ఎంతో ఇంట్రెస్ట్. మంచి పనికోసం మేము చాలాసార్లు క్రికెట్ మ్యాచ్ లు ఆడడం జరిగింది.అయితే ఈస్ట్ వెస్ట్,ఏలైట్ మీడియా వారు మమ్మల్ని కలసి ఒక మంచి కాజ్ కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము మా సపోర్ట్ కావాలన్నారు. ఒక మంచి కాజ్ కోసం మేము ఒప్పుకొని మ్యాచ్ ఆడడం జరిగింది. అయితే మేము సౌత్ ఆఫ్రికాలోని సెంచూరియన్ గ్రౌండ్స్ లో అడతామని అనుకోలేదు. తమన్ కొట్టిన సిక్స్ లన్నీ కూడా గ్రౌండ్ బయట పడ్డాయి. అక్కడ రమేష్ అందరికి చక్కటి హాస్పిటాలిటీ కల్పించారు. ఇప్పుడు మళ్లీ డల్లాస్ లో క్రికెట్ ఆడడానికి సిద్ధమయ్యాము. అక్కడ వరప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా ఏర్పాట్లు చేశారు అని అన్నారు.