Tollywood: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో వరుసవిషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నందమూరి తారకరత్న మరణం మరువక ముందే టాలీవుడ్‌లో మరోకరు గుండెపోటుతో కన్నుమూశారు. టాలీవుడ్‌లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్..

Tollywood: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత
Chiranjeevi - Praveen Anumolu

Edited By:

Updated on: Mar 06, 2023 | 7:04 PM

తెలుగు సినీ పరిశ్రమలో వరుసవిషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నందమూరి తారకరత్న మరణం మరువక ముందే టాలీవుడ్‌లో మరోకరు గుండెపోటుతో కన్నుమూశారు. టాలీవుడ్‌లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు ఆదివారం (మార్చి 5) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2017లో విడుదలైన ‘దర్శకుడు’ మూవీకి ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. జక్కా హరి ప్రసాద్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అశోక్‌ బండ్రెడ్డి హీరోగా నటించగా, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. సుకుమార్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా కూడా ప్రవీణ్ పనిచేశారు. అతిచిన్న వయసులోనే ప్రవీణ్ గుండె పోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులంతా శోక సంద్రంలో మునిగిపోయారు.

కాగా ఇటీవల తారకరత్న గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్నిరోజుల ముందు కే విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన మరణించిన కొన్ని రోజులకే ఆయన సతీమణి జయలక్ష్మీ మరణించారు. జమున, కృష్ణ, సత్యనారాయణ ఇలా కేవలం నెలల వ్యవధిలోనే సినీ ప్రముఖుల మరణాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రవీణ్‌ మృతి చెందడంతో సినీ పరిశ్రమలో విషాద చాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us