AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు పిలిచి ఛాన్స్‌లు ఇచ్చారు.. ఇప్పుడు నాకు ఆఫర్స్ ఇవ్వడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. టాలీవుడ్‌లో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తుపట్టారా.?

అప్పుడు పిలిచి ఛాన్స్‌లు ఇచ్చారు.. ఇప్పుడు నాకు ఆఫర్స్ ఇవ్వడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన
Tollywood News
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2025 | 9:08 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ మారి సినిమాలు చేస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తుపట్టారా.? హీరోయిన్ ప్రేమ, భానుచందర్, వనీత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన దేవి సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో తన నటనతో భయపెట్టించాడు. అలాగే మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమాల్లో కనిపించాడు. ఇంతకీ ఆ కుర్రాడి పేరు ఏంటో తెలుసా.. తన పేరు మహేంద్రన్. తెలుగులో ఆహా మూవీతో వెండితెరకు పరిచమయమైన మహేంద్రన్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 1994లో కోలీవుడ్‌లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేంద్రన్.. తెలుగులో అనేక చిత్రాల్లో నటించాడు. చిన్నవయసులోనే తనదైన నటనతో సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు మహేంద్రన్.

తెలుగులో ఆహా, దేవి, పెళ్లి చేసుకుందాం, నీ స్నేహం, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు మహేంద్రన్. ముఖ్యంగా దేవీ, లిటిల్ హార్ట్స్ సినిమాల్లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ బాలనటుడిగా నంది పురస్కారాలు సైతం సొంతం చేసుకున్నాడు. తమిళం, తెలుగు, మలయాళం ఇలా అన్ని భాషలలో బాల నటుడుగా దాదాపు 130 సినిమాలలో నటించాడు. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. ఇటీవలే ఈ చిన్నోడు హీరోగా మారాడు. తమిళంలో హీరోగా అనేక సినిమాలు చేశాడు. అలాగే ఇతర హీరోల సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మాస్టర్ సినిమాలో యంగ్ భవాని రోల్‌లో కనిపించింది మహేంద్రనే.  కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మహేంద్రన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.. అప్పట్లో నాకోసం స్టార్ హీరోలు ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు ఆఫర్స్ ఇవ్వడం లేదు అని అన్నాడు మహేంద్రన్. ఓ ఇంటర్వ్యూలో మహేంద్రన్ మాట్లాడుతూ.. ఒక సమయంలో మంచి పీక్ చూశాను.. ఒకే రోజు నాలుగు సినిమాలు చేశాను. రోజుకు మూడు విమానాలు దిగేవాడిని. ఉదయం తమిళనాడులో, మధ్యాహ్నం పొలాచీలో.. రాత్రి హైదరాబాద్ లో షూట్ చేసేవాడిని.. నాకోసం స్టార్స్ ఎదురుచూసేవారు. నాకోసమే ఎక్కువగా నైట్ షూట్స్ పెట్టేవారు. అప్పట్లో ఆహా అనే సినిమాలో నటించా.. అందులో నటించిన స్టార్స్.. రఘువరుణ్ గారు, జయసుధగారు, జగపతిబాబుగారు ఇలా ఎదురుచూసేవారు. అలాంటి నాకు మధ్యలో సినిమాలు లేవు.. ఎవ్వరూ ఆఫర్స్ ఇవ్వలేదు. పెద్దయ్యాక ఆఫర్స్ ఇవ్వలేదు.. హీరోలా లేదు.. చిన్నోడు కాదు పెద్దోడు కాదు అంటూ నన్ను రిజెక్ట్ చేశారు.. చాలా స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడు తిరిగి ఆఫర్స్ అందుకుంటున్నా.. ఇది నా అసలైన జర్నీ అని చెప్పుకొచ్చాడు మహేంద్రన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us