
మరి కొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. సర్వం సిద్ధం అంటోంది ఎన్నికల కమిషన్. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఏర్పాట్లను పరిశీలించారు CEO వికాస్ రాజ్. గురువారం పోలింగ్ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు ఈవీఎంలను తరలిస్తోంది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 వేల 290 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. పోలింగ్ కోసం 35 వేల 655 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల 94 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌తో పాటు పరిశీలన కోసం 22 వేలమంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్లను నియమించారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. ఎన్నికల బందోబస్తు విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు, 50 వేల మంది పోలీసులు పాల్గొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..