Celebrity Divorce Couples: ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటలు వీళ్లే..

|

Oct 03, 2021 | 12:08 PM

ప్రేమ, వివాహం.. చివరకు విడాకులు.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. ప్రస్తుతం. గత కొంత కాలంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు

Celebrity Divorce Couples: ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటలు వీళ్లే..
Follow us on

ప్రేమ, వివాహం.. చివరకు విడాకులు.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. ప్రస్తుతం. గత కొంత కాలంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రెటీ కపుల్స్ విడాకులు తీసుకుంటున్న సంఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా తామిద్దరం విడిపోతున్నామంటూ ప్రకటించి షాకిచ్చారు నాగచైతన్య, సమంత. వీరిద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బ్యూటీఫుల్ కపుల్స్‏గా ఇమేజ్ ఉంది. అంతేకాకుండా… సామ్ చై జంటను అభిమానించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నిన్న శనివారం.. తామిద్దరం విడిపోతున్నామంటూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించడంతో అభిమానులే కాకుండా… సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉండే జంట ఇలా అనుహ్య నిర్ణయం తీసుకోవడమేంటనీ సందేహం వ్యక్తం చేశారు.

అయితే ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్‏లో సినిమా జంటలు పెళ్లయ్యాక బ్రేకప్ చెప్పుకున్నవాళ్లు ఉన్నారు. అలాగే పెళ్లి వరకు వచ్చి విడిపోయిన జంటలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున సైతం.. దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీతో 1984లో పెళ్లి జరిగింది. వీరిద్దరు నాగచైతన్య పుట్టాక విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో నటి అమలతో పెళ్లి జరిగింది. వీరికి అఖిల్ జన్మించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తొలిపెళ్లి వైజాగ్ నందినితో జరిగింది. కానీ వీరు 2008లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ ‘రేణు దేశాయ్’ ని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక 2012లో విడాకులు తీసుకున్నారు. ఇక 2013లో రష్యా నటి ‘అన్నా లెజ్నావెనిని పెళ్లి చేసుకున్నారు. అలాగే నటుడు శరత్ బాబు
1981లో తోటి నటి కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులిచ్చి స్నేహా నంబియార్‌తో 1990లో పెళ్లి జరిగింది. ప్రస్తుతం స్నేహకు సైతం శరత్‌ బాబు విడాకులు ఇచ్చాడు.

కమల్ హాసన్.. 1978లో ప్రముఖ నాట్య కళాకారిణి వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విడాకులు తీసుకుని 1988లో సారికను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి శృతిహాసన్, అక్షర హాసన్‏లు జన్మించారు. 2004లో కమల్, సారిక విడిపోయారు. ఆ తర్వాత నటి గౌతమితో 13 ఏళ్లు సహజీవనం చేశారు. ఇప్పుడు వీరిద్దరు విడిగానే ఉంటున్నారు. ఇక ప్రముఖ సినీనటి రాధిక 1985లో ప్రతాప్ పోతన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకుని రెండో సారి లండన్‌కు చెందిన రిచర్డ్ హ్యార్లీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2001లో హీరో శరత్ కుమార్‌తో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ముందుగా లలితా కుమారిని పెళ్లి చేసుకున్నాడు. 2009లో ఆమెతో విడాకులు తీసుకుని 2010లో ప్రముఖ కొరియోగ్రాఫర్ సోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రకాష్ కోవెలమూడి.. దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు… 2014లో కనిక దిల్లాన్‏ను పెళ్లిచేసుకుని… ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెండో పెళ్లి కనిక చేసుకున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీలో మరో జంట… కీర్తిరెడ్డి- సుమంత్
2004లో పెళ్లి జరిగింది. 2006లో వీరిద్దరు విడాకులు. ఆ తర్వాత 2014లో లండన్‏లో సెటిలైన డాక్టర్ కార్తీక్‏ను వివాహం చేసుకుంది కీర్తిరెడ్డి. వీరికి ఇద్దరు పిల్లలు.

ఇక సైఫ్ అలీఖాన్ తొలి పెళ్లి 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్‏తో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతాకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు సైఫ్ అలీఖాన్. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‏ను రెండో వివాహం చేసుకున్నారు. అలాగే ధర్మేంద్ర.. తొలి పెళ్లి ప్రకాష్ కౌర్ తో జరిగింది.. సన్నీడియోల్, బాబీ డియోల్, విజీత, అజీతలు వారి సంతానం. ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చి హేమా మాలినిలు రెండో వివాహం చేసుకున్నారు.

ఇక ప్రముఖ గాయని సునీతకు ముందుగా కిరణ్‏తో పెళ్లి జరిగింది. వీరికి కూతురు శ్రేయ, ఆకాష్ అనే పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్నారు సునీత. బాలీవుడ్ నిర్మాత బోనీ కఫూర్ తొలిగా మోనా శౌరి కపూర్‏ని వివాహం చేసుకున్నారు. అర్జున్ కపూర్. అన్షులా వీరి సంతానం. ఆ తర్వాత శ్రీదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరి పిల్లలు జాహ్నవి, ఖుషీలు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చారు. పెళ్లి చేసుకున్న మూడేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. అలాగే నటి ఝాన్సీ, జోగినాయుడు వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ. ఆ తర్వాత వీరు విడిపోయారు. ఇక ఇటీవల అమీర్ ఖాన్ ఏప్రిల్ 18, 1986న నటి రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వారికి జునైద్, కుమార్తె ఇరా పిల్లలు. లగాన్ సినిమా నిర్మాణంలో అమిర్‏కు సహాయం చేసిన రీనాను పెళ్లి చేసుకున్నారు. వీరు డిసెంబరు 2002న విడాకులు తీసుకున్నారు. డిసెంబరు 28, 2015న అమిర్ ఖాన్, కిరణ్ రావుల వివాహం జరిగింది. వారికి ఆజాద్ రావు ఖాన్ పిల్లోడు. 2021లో విడిపోయారు. ఇక హృతిక్‌ రోషన్ డిసెంబరు 20, 2000న నటుడు సంజయ్ ఖాన్ కుమార్తె సుస్సెన్నే ఖాన్ ను వివాహం చేసుకున్నారు. వీరికి హ్రీహాన్, హిధాన్ ఇద్దరు పిల్లలు. డిసెంబరు 13, 2013న తమ 17ఏళ్ళ కాపురానికి ముగింపు పలికారు. ఆమెకు హృతిక్ 380 కోట్ల భరణం ఇచ్చాడు.

అలాగే సంజయ్‌ దత్‌.. 1987లో నటి రిచా శర్మతో వివాహం జరిగింది. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్‏తో మృతి చెందింది. వీరికి త్రిషాలా కూతురు. 1998లో మోడల్ రియా పిళ్ళైతో రెండో పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మాన్యతా దత్ ను గోవాలో మూడో పెళ్ళి చేసుకున్న సంజయ్. 2010న వారికి కవల పిల్లలు అబ్బాయి షహ్రాన్, అమ్మాయి ఇక్రా. రామలత‏ను ప్రభుదేవా వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఒకరు మృతి చెందారు. ఆ తర్వాత నయనతారతో సహజీవనం చేశారు. ఇక భార్య లతతో 2010లో విడాకుల కోసం కోర్టుకు వెళ్లాడు.. వీరికి 2011 విడాకులు వచ్చాయి.. 25 కోట్ల విలువ చేసే ఆస్తులు లతకు ఇచ్చాడు ప్రభుదేవా. ఇక ఆయనతో సహజీవనం చేయనని 2012లో నయనతార ప్రకటించింది. ఇక ఆదిత్య చోప్రా 2009లో భార్య పాయల్ ఖన్నాతో విడాకులు తీసుకున్నాడు. ఏప్రిల్ 21, 2014న నటి రాణీ ముఖర్జీని వివాహం చేసుకున్నారు. వీరికి అదిరా చోప్రా సంతానం. ఇక సంజయ్‌కపూర్‌, మహీప్‌కపూర్‌ను చేసుకున్నారు. వీరికి శనన్యకపూర్‌ అనే కుమార్తె. కరిష్మాకపూర్‏ను రెండో వివాహం చేసుకున్నాడు సంజయ్‌కపూర్‌. కొన్నాళ్లకు దంపతుల మధ్య విభేదాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. ఇక తాజాగా నాగ చైతన్య, సమంత కూడా విడాకులు తీసుకున్నారు. నిన్న ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఎవరి దారి వారు చూసుకోవాలనుకున్నాం.. తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరుతూ ట్వీట్ చేశారు.

Also Read: Samantha-NagaChaitanya: ముగిసిన అందమైన ప్రేమకథ.. సమంత-నాగచైతన్య విడాకులపై సురేఖావాణి రియాక్షన్..