
చైల్డ్ ఆర్టిస్ గా పలు సినిమాల్లో నటించి ఆతర్వాత హీరోయిన్ గా మారింది అందాల భామ తేజస్వి మదివాడ. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్, రామ్ పోతినేని నటించిన పండగ చేస్కో లాంటి సినిమాల్లో నటించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారి కేరింత సినిమా, ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి షాక్ ఇచ్చింది. ఆతర్వాత కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటించిన తేజస్వి ఈమధ్య పెద్దగా కనిపించడం లేదు.. సినిమాలు సిరీస్ లే కాదు టాక్ షోలకు హోస్ట్ గాను చేసింది తేజస్వి. కాగా గతంలో తేజస్వి మదివాడ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. 33 ఏళ్ల వయసులో తన బడీ ఫిట్‌గా, మరింత అందంగా మారడానికి జిమ్‌లో కష్టపడ్డానని ఆమె తెలిపారు. మాల్దీవులు, థాయ్‌లాండ్‌లలో బికినీలు ధరించానని, ఇది నటిగా సీన్స్ అవసరాల మేరకు మాత్రమేనని స్పష్టం చేసింది తేజస్వి. కిస్సింగ్ సన్నివేశాలు, రామ్ గోపాల్ వర్మ సినిమాలలో నటించానని గుర్తు చేసుకున్నారు. తాను ఇన్నోసెంట్‌ను కాదని తన బాయ్ ఫ్రెండ్ కు ముందే చెప్పానని, తన జీవితం, ప్రపంచం గురించి తనకు తెలుసని తేజస్వి చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షో తన కెరీర్‌కు అంతగా ప్లస్ అవ్వలేదని తేజస్వి తెలిపింది. 2017లో బిగ్ బాస్ లోకి వెళ్లడం పెద్ద తప్పు అని ఆమె అన్నారు. ఆ షో నుంచి వచ్చిన మానసిక ఒత్తిడి కారణంగా రెండు సంవత్సరాలు సినిమా ఆఫర్‌లు తీసుకోలేదని, తన మెంటల్ స్టేట్ ఎవరికీ అర్థం కాలేదని తెలిపింది. ఈ కారణంగా తన వివాహం కూడా రద్దైందని, తీవ్రమైన మానసిక వేదనకు గురై ఇండియా వదిలి వెళ్లిపోవాలని కూడా భావించినట్లు తెలిపింది.
తెలుగు సినీ పరిశ్రమలో కమిట్‌మెంట్స్ అనే అంశంపై మాట్లాడుతూ, తనను ఎవరూ నేరుగా కమిట్‌మెంట్స్ అడగలేదని తెలిపారు. అయితే, కెరీర్ ప్రారంభంలో రాత్రి డిన్నర్ కు పిలవడం వంటి కొన్ని షేడీ వైబ్స్‌ను తాను ఎదుర్కొన్నా అని తెలిపింది. అయితే, తన వ్యక్తిత్వం, నిర్మొహమాటంగా మాట్లాడే స్వభావమే తనను కమిట్‌మెంట్స్ నుండి కాపాడిందని తేజస్వి అభిప్రాయపడ్డారు. కమిట్‌మెంట్స్ అనేది తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం కాదని, ప్రపంచంలో ఏ పరిశ్రమలోనైనా, ఏ రంగంలోనైనా ఇలాంటివి ఉంటాయని, తనను తాను కాపాడుకోవడం తన బాధ్యత తెలిపింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.