Actress: బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

|

Oct 06, 2024 | 6:57 PM

తెలుగు, తమిళ్, కన్నడ, పంజాబీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. కానీ ఎందుకో గానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కట్ చేస్తే చాలా మంది హీరోయిన్ల లాగానే పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. సుమారు మూడేళ్ల క్రితం ఓ నేవీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకున్న ఈ అందాల తార

Actress: బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tolllywood Actress
Follow us on

పై ఫొటోలో బేబీ బంప్ తో కనిపిస్తున్న దెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. బాలీవుడ్‌లో మొదట ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత దక్షిణాదిలోనూ పాగా వేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, పంజాబీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. కానీ ఎందుకో గానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కట్ చేస్తే చాలా మంది హీరోయిన్ల లాగానే పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. సుమారు మూడేళ్ల క్రితం ఓ నేవీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకున్న ఈ అందాల తార త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది. అమ్మతనానికి ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉంటోన్న ఈ అందాల తారను గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుదాం లెండి.. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు 2007లో గొడవ సినిమాతో సందడి చేసిన శ్రద్ధా ఆర్య. కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో వైభవ్ హీరోగా నటించాడు. ఈ మూవీలో శ్రద్దా ఆర్య అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. దీని తర్వాత రోమియో, కోతిమూక తదితర తెలుగు సినిమాల్లో కనిపించింది శ్రద్ధ.

శ్రద్ధా ఆర్య 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో నిశ్శబ్ద్‌ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాతే గొడవ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడ పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. ‘తుమ్‌హారి పాఖి’, ‘కుండలి భాగ్య’, ‘డ్రీమ్ గర్ల్’ లాంటి సీరియల్స్‌ శ్రద్ధకు మంచి పేరు తీసుకొచ్చాయి.

ఇవి కూడా చదవండి

శ్రద్ధా ఆర్య లేటెస్ట్ ఫొటోస్..

శ్రద్ధ 2021 నవంబర్‌లో రాహుల్ నాగల్‌ అనే నేవీ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడీ మూడేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానిస్తోందీ అందాల తార. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ రెగ్యులర్ గా తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

భర్తతో శ్రద్ధా ఆర్య..