Tollywood: సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్.. టీమిండియా తరపున బరిలోకి టాలీవుడ్ ప్రముఖ నటి.. ఫొటోస్ వైరల్

ఈ టాలీవుడ్ అందాల తార గత 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.

Tollywood: సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్.. టీమిండియా తరపున బరిలోకి టాలీవుడ్ ప్రముఖ నటి.. ఫొటోస్ వైరల్
Tollywood Actress Pragathi

Updated on: Dec 01, 2025 | 7:07 PM

సాధారణంగా 50 ఏళ్ల వయసు దాటిన వారు ఎక్కువగా ఇంటికే పరిమితమవుతారు. విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. అయితే ఈ టాలీవుడ్ నటి మాత్రం 50 ఏళ్ల వయసులోనూ కఠినమైన వర్కౌట్లు, వ్యాయామాలు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. అంతేకాదు ప్రొఫెషనల్‌ పవర్‌ లిఫ్టర్‌గా సత్తా చాటుతోంది. నేషనల్ లెవెల్ పోటీల్లోనూ పాల్గొని బంగారు, వెండి పతకాలు సాధిస్తోంది. లేటు వయసులోనూ ఈ అందాల తార చూపిస్తున్న డెడికేషన్ ను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక పోటీల్లో సత్తా చాటిన ఈ టాలీవుడ్ నటి ఇప్పుడు మరో అరుదైన ఘనతను అందుకుంది. అదేంటంటే.. త్వరలో ఈ ముద్దుగుమ్మ టీమిండియా తరపున బరిలోకి దిగనుంది. త్వరలో జరగనున్న ప్రతిష్ఠాత్మక పోటీల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించనుంది ఈ విషయాన్ని సదరు నటినే స్వయంగా వెల్లడించింది. టీమిండియా జెర్సీ ధరించి, ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరి ఈ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు నటి ప్రగతి

గతేడాది జరిగిన సౌతిండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో వెండి పతకం సాధించింది ప్రగతి. ఇక ఈ ఏడాది కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు, రెండు వెండి పతకాలు సాధించి తన పవర్ ను మరోసారి చూపించిందీ అందాల తార. ఇప్పుడు ఏకంగా భారత తరఫున త్వరలో జరగబోయే పోటీల్లో పాల్గొనబోతుంది ప్రగతి. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే వెల్లడించింది. ప్రస్తుతం ప్రగతి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ప్రగతికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రగతి షేర్ చేసిన ఫొటోస్..

ఈ అందాల తార హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో సహాయక నటిగా మారింది. హీరోలు, హీరోయిన్లకు అమ్మగా.. అక్కగా.. వదినగా అనేక రకాల పాత్రలలో నటించి మెప్పించింది. తన యాక్టింగ్ తోనూ, కామెడీ టైమింగ్ తోనూ తెలుగు ప్రేక్షకులను అలరించింది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కలిసి సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించింది ప్రగతి. అయితే ఇప్పుడు సినిమాలు తగ్గించేసిన ఆమె పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటుతోంది.

పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ లో ప్రగతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.