Tollywood: భర్త ఆత్మహత్య.. ప్రియునితో రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ తెలుగు హీరోయిన్ మొదట బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంది. తన మొదటి సినిమా హిందీలోనే విడుదలైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో నూ అడుగు పెట్టింది. హీరోయిన్ గా వరుసగా సినిమాల్లో యాక్ట్ చేసింది.

Tollywood: భర్త ఆత్మహత్య.. ప్రియునితో రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్
Tollywood Actress

Updated on: Feb 16, 2025 | 8:44 PM

టాలీవుడ్ హీరోయిన్ పావని రెడ్డి మళ్లీ పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానోచ్‌. ఒకరికొకరు తోడుంటామని సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నాం. ఇకపై కలిసి జీవిద్దాం’ అంటూ ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది పావని రెడ్డి. ఈనెల 20న ప్రముఖ కొరియోగ్రాఫర అమిర్ తో ఏడడుగులు నడవనున్నట్లు ఈ పోస్ట్ లో పేర్కొందీ అందాల తార. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పావని, అమిర్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పావని రెడ్డి 2013లో తెలుగు నటుడు ప్రదీప్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరిగ్గా ప్రేమికుల రోజే ఈ వివాహం జరిగింది. అయితే సడన్‌గా ఏమైందో ఏమో కానీ 2017లో ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని పుప్పాల గూడలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించాడు. అప్పట్లో ఈ సంఘటన టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. పావని రెడ్డి పేరు కూడా సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. ఆమె వేరొకరితో చనువుగా ఉండడం వల్లే ప్రదీప్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ప్రచారం జరిగింది. ఈ విషాదం తర్వాత పావని నిర్మాత ఆనంద్‌జాయ్‌ను పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే అది వాస్తవం కాదని ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు.

కాగా తమిళ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొన్న పావని రెడ్డి సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఇే సమయంలో ఈ రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌ ఆమిర్‌తో ఆమె ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ రూమర్లను నిజం చేస్తూ రెండో పెళ్లికి సిద్ధమైంది పావని రెడ్డి.

ఇవి కూడా చదవండి

పావని రెడ్డి షేర్ చేసిన వీడియో..

తెలుగులో సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించింది పావని రెడ్డి, డబుల్‌ ట్రబుల్‌, డ్రీమ్‌, గౌరవం, లజ్జ, ప్రేమకు రెయిన్ చెక్, సేనా పతి, మళ్లీ మొదలైంది, తునివు (తెలుగులో తెగింపు), చారి 111 చిత్రాల్లో మెరిసింది. తమిళ్ లోనూ పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక అగ్ని పూలు, నా పేరు మీనాక్షి, శ్రీమతి తదితర సీరియల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైంది. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాటర్స అనే వెబ్ సిరీస్ తో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది పావని రెడ్డి.

 

పావని రెడ్డి లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.