Actress Hema: అబ్బో.. హేమ ఎంట్రీ డ్రామా..! బురఖాలో వైద్య పరీక్షలకు వెళ్లిన నటి

|

Jun 04, 2024 | 7:15 AM

రేవ్ పార్టీ వివాదంలో చిక్కుకున్న నటి హేమ ఇప్పుడు మరింత చిక్కుల్లో పడింది. బెంగళూరులో హేమను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ జి.ఆర్ లోని ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ లో డ్రగ్స్ ఉపయోగించినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని రెండుసార్లు నోటీసులు జారీ చేశారు పోలీసులు.

Actress Hema: అబ్బో.. హేమ ఎంట్రీ డ్రామా..! బురఖాలో వైద్య పరీక్షలకు వెళ్లిన నటి
Hema
Follow us on

రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ వివాదంలో చిక్కుకున్న నటి హేమ ఇప్పుడు మరింత చిక్కుల్లో పడింది. బెంగళూరులో హేమను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ జి.ఆర్ లోని ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ లో డ్రగ్స్ ఉపయోగించినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని రెండుసార్లు నోటీసులు జారీ చేశారు పోలీసులు. కానీ ఆమె హాజరుకాలేదు. దాంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఈసారి హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాంతో ఆమె విచారణకు హాజరైంది.

కాగా జూన్ 3మా  హేమ బురఖా వేసుకుని పోలీసుల ఎదుట హాజరైంది. మీడియా, జనాలు గుర్తుపట్టకుండా.. ఆమె బురఖా ధరించింది. పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్టులో నిర్ధారణ అయింది . అలాగే ఈ పార్టీలో ఆమె పాత్ర కీలకంగా ఉందని సమాచారం. రేవ్ పార్టీ (బెంగళూరు రేవ్ పార్టీ) జరిగిన ప్రదేశంలో సీసీబీ పోలీసులు దాడులు చేసిన సమయంలో కూడా హేమ హేమ మొఖం కనిపించకుండా జాగ్రత్తపడింది.

అదే ఫామ్‌హౌస్ ప్రాంగణంలో వీడియో తీసి, ‘నేను హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఉన్నాను. ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదని అబద్ధం చెప్పింది. దాంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఆతర్వాత కూడా ఆమె పార్టీకి వెళ్ళలేదు అని తప్పించుకునేందుకు ప్రయత్నం చేసింది. ఇంట్లో బిర్యానీ వండుతున్న వీడియోను రిలీజ్ చేసింది. ఆ తర్వాత డ్రగ్స్ టెస్ట్ లో హేమకు పాజిటివ్ రావడంతో హేమ బండారం బయటపడింది. ఇక హేమ బురఖా ధరించి విచారణకు హాజరైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమ ను కోర్టు లో హాజరు పరిచిన పోలీసులు. జూన్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.