ఆ స్టార్ హీరోతో ముద్దు సీన్.. కావాలనే నాలుగు టేక్‌లు తీసుకున్నా.! ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ నటి..

టాలీవుడ్ నటి అనూజారెడ్డి సుమారు 250 చిత్రాలలో నటించి.. ఆపై 20 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇక ఇప్పుడు రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. మరో 250 సినిమల్లో నటించగలనని అంటోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

ఆ స్టార్ హీరోతో ముద్దు సీన్.. కావాలనే నాలుగు టేక్‌లు తీసుకున్నా.! ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ నటి..
Actress

Updated on: Jan 01, 2026 | 9:07 AM

టాలీవుడ్ నటి అనూజారెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, ఇండస్ట్రీ నుంచి తీసుకున్న గ్యాప్, భవిష్యత్ ప్రణాళికలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె దాదాపు 250 చిత్రాలలో నటించి, ఆపై 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడు రీ-ఎంట్రీ ఇచ్చి మరో 250 చిత్రాలు చేసేంత సామర్ధ్యం తనలో ఉందని చెప్పుకొచ్చింది. అటు ఈమె పలు సీరియల్స్‌లో నటించి మెప్పిస్తోంది. ప్రస్తుత టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎక్కువయ్యారని, తమలాంటి పాత నటీనటులను ఇండస్ట్రీ మర్చిపోయిందని అనూజారెడ్డి అభిప్రాయపడింది. అయితే అభిమానులు మాత్రం తమను గుర్తు చేసుకుంటూనే ఉన్నారని తెలిపింది.

ప్రస్తుతం రీ-ఎంట్రీ ఇద్దామని చూస్తున్న అనూజరెడ్డి.. మంచి క్యారెక్టర్లు లభిస్తేనే నటిస్తానని ఆమె కండిషన్ పెట్టింది. అమ్మ, అక్క లాంటి పాత్రలకు తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలను చేయాలనేది తన కోరిక అని ఆమె వివరించింది. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తనకు ఇష్టమని, ముఖ్యంగా మహేష్ బాబు మొదటి నుంచి తన ఫేవరెట్ హీరో అని పేర్కొంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణతో కూడా తాను నటించానని.. ఆయనతో కలిసి నటించిన ఓ ముద్దు సీన్‌కు కేవలం 4 టేకులే తీసుకున్నానని గుర్తు చేసుకుంది. కాగా, పలువురు ఓల్డ్ ఆర్టిస్టులు ఇప్పటికీ మళ్లీ తిరిగి ఇండస్ట్రీలోకి రావాలని పలువురు అభిమానులు ఆశిస్తున్నట్టు నటి అనూజ రెడ్డి తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..