Actor Srikanth: థర్డ్ వేవ్ లో భారీగా కరోనా బారిన పడుతున్న సినీనటులు.. తాజాగా శ్రీకాంత్ కు పాజిటివ్ గా నిర్ధారణ..

Actor Srikanth: దేశంలో కరోనా వైరస్ (Corona Virus ) తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ ఓ రేంజ్ లో కల్లోలం సృష్టిస్తోంది. థర్డ్ వేవ్(Third Wave) లో భారీగా పాజిటివ్ (Corona Positive)కేసులు నమోదవుతున్నాయి. సినీ, రాజకీయ..

Actor Srikanth: థర్డ్ వేవ్ లో భారీగా కరోనా బారిన పడుతున్న సినీనటులు.. తాజాగా శ్రీకాంత్ కు పాజిటివ్ గా నిర్ధారణ..
Actor Srikanth

Updated on: Jan 26, 2022 | 11:19 AM

Actor Srikanth: దేశంలో కరోనా వైరస్ (Corona Virus ) తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ ఓ రేంజ్ లో కల్లోలం సృష్టిస్తోంది. థర్డ్ వేవ్(Third Wave) లో భారీగా పాజిటివ్ (Corona Positive)కేసులు నమోదవుతున్నాయి. సినీ, రాజకీయ రంగంలోని వారు కూడా బారీగా కరోనా బారినపడుతున్నారు. కోలీవుడ్, మాలీవుడ్ టాలీవుడ్ అని లేదు.. అన్ని వుడ్ లను కరోనా మహమ్మారి చుట్టేస్తోంది. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడినట్లు ప్రకటించిన కొన్ని గంటలకే మరో టాలీవుడ్ ప్రముఖ నటుడు తాను కూడా కోవిడ్ బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ నటుడు శ్రీకాంత్ మేక తాను కరోనా బరినపదినట్లు ప్రకటించారు. తాను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనని కరోనా వదల లేదని.. తాజాగా తనకు కోవిడ్ (C-OVID19) పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ప్రకటించారు శ్రీకాంత్.  ప్రియమైన మిత్రులారా, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు C-OVID19 పాజిటివ్ అని తేలింది. గత రెండు రోజుల నుండి కొన్ని లక్షణాలు కనిపించాయి. దీంతో తాను కరోనా టెస్ట్ చేయించుకున్నట్లు.. పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. అంతేకాదు తనతో గత కొన్నిరోజులుగా ఉన్నవారందరూ జాగ్వరత్లతగా ఉండాల్సింసిందిగా సూచించారు. ఏమైనా కరోనా లక్షణాలు ఉన్నాయా అని నిశితంగా తనిఖీ చేయవలసిందిగా ఆయన కోరారు. లక్షణాలు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 

Also Read:  సపోర్టింగ్ ఆర్టిస్ట్‌ నుంచి స్టార్ హీరో.. నేడు రవితేజ పుట్టిన రోజు.. మొదటి అవకాశం ఎలా వచ్చిందంటే..