ఏంటి భయ్యా అంత మాట అన్నావ్.!! నా సినిమా వాళ్ల సినిమాలా కాదన్నా నిఖిల్

కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్‌. అయితే ఆ తర్వాత అతను చేసిన 18 పేజీస్‌, స్పై సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి. అయితే ఇప్పుడు మళ్లీ పాన్‌ ఇండియా మూవీతోనే హిట్‌ కొడతానంటున్నాడీ యంగ్‌ హీరో. నిఖిల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం స్వయంభు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం సెన్సేషన్‌ సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా నటిస్తోంది

ఏంటి భయ్యా అంత మాట అన్నావ్.!! నా సినిమా వాళ్ల సినిమాలా కాదన్నా నిఖిల్
Nikhil

Updated on: Feb 15, 2026 | 8:12 PM

యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు నిఖిల్. ఈ యంగ్ హీరో చివరిగా కార్తికేయ 2 సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు స్వయంభు అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ కుర్ర హీరో ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం’స్వయంభు’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పటినుంచో జరుగుతుంది. ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న స్వయంభు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానింది.

అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె

ఇక ఈ సినిమాలో అందాల భామలు సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, పవర్ ఫుల్ పాన్-ఇండియా విజన్ తో వస్తున్న స్వయంభు నిఖిల్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ టీజర్ మెప్పించినప్పటికీ.. కొందరు టీజర్ క్వాలిటీ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. క్వాలిటీ మిస్ అయ్యిందని.. హెచ్ డీ క్వాలిటీ రిలీజ్ చేయండి అంటూ కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

నాకు పెళ్లయింది అని చెప్పా.. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది..! షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

టెక్నీకల్ ఇష్యు వల్లే టీజర్ క్వాలిటీ తగ్గిందని చిత్రయూనిట్ చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పుడు HDR క్వాలిటీతో టీజర్‌ను మళ్లీ రీ-అప్‌లోడ్ చేశారు. దీని పై హీరో నిఖిల్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు. యూట్యూబ్ ఎందుకు ఇలా గ్లిచ్ చేస్తుంది భయ్యా  అని నిఖిల్ రాసుకొచ్చాడు. అలాగే ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల్లా మా ‘స్వయంభు’ సినిమాలో ఎలాంటి ఏఐ వాడలేదు అని పోస్ట్ షేర్ చేశాడు నిఖిల్. దాంతో నిఖిల్ ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ షేర్ చేశాడు.? అంటూ నెటిజన్స్ ఆలోచనలో పడ్డారు. అయితే కొంతమంది రాజా సాబ్ అని అంటుంటే మరికొంతమంది రీసెంట్ గా విడుదలైన నాగబంధం సినిమాపై అని అంటున్నారు.

ఇప్పటికీ మిస్ అవుతున్నాం.! ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి