అందుకే సినిమాలకు దూరం అయ్యా..! ఖుషీ బబ్లూ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే

తెలుగులో కమెడియన్‌గా పలు చిత్రాల్లో నటించిన బబ్లూ.. అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి.. అనంతరం స్టార్ హీరోల చిత్రాల్లో వరుసపెట్టి ఛాన్స్‌లు దక్కించుకున్నాడు.

అందుకే సినిమాలకు దూరం అయ్యా..! ఖుషీ బబ్లూ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే
Babloo

Updated on: Jan 01, 2026 | 10:40 AM

చాలా మంది సినీ నటులు కొన్ని సినిమాలతోనే కనిపించకుండా మాయం అవుతుంటారు. అలాంటి వారిలో బబ్లూ ఒకరు. చిత్రం సినిమాతో ఫేమ్ బబ్లూ పరిచయం అయ్యాడు. ఆతర్వాత కొన్ని సినిమాల్లో కనిపించి మెప్పించాడు. చిరుత, ఆర్య, చిత్రం, ఖుషీ, మౌనమేలనోయి, ఇ.వి.వి. గారి ఎవడి గోల వాడిది వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించిన బబ్లూ.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. పూర్తిగా సినిమాలకు దూరమైన బబ్లూ ఇప్పుడు ఏం చేస్తున్నాడా అని చాలా మంది గూగుల్ లో గాలిస్తున్నారు. చాలా తర్వాత మీడియా ముందుకు వచ్చి తన సినీ ప్రస్థానం, సినీ పరిశ్రమకు దూరం కావడానికి గల కారణాలు పంచుకున్నాడు. కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొన్న బబ్లూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పలు విజయవంతమైన చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించిన బబ్లూ, ఉన్నట్టుండి స్క్రీన్ మీద కనిపించకపోవడంతో ఆయన అభిమానులు, సినీ వర్గాల్లో అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఆఫర్స్ లేకే ఆయన దూరమయ్యారని చాలామంది భావించారు.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

అయితే, బబ్లూ తన తండ్రి మరణానంతరం తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నానని, ఆ సమయంలో తనకు చాలా అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయానని స్పష్టం చేశారు. డిప్రెషన్ నుంచి బయటపడటానికి, నాలో మార్పు కోసం 2008లో బ్యాంకాక్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మొదట రెండు నెలల పాటు వెళ్లి రిఫ్రెష్ అయ్యి తిరిగి రావాలని అనుకున్నానని, కానీ అక్కడ డిజేయింగ్‌లో స్థిరపడి 24 నెలల అగ్రిమెంట్‌లో 18 నెలలు అక్కడే ఉన్నానని తెలిపాడు బబ్లూ. చిరుత ఆడియో ఫంక్షన్ తర్వాత పూరి జగన్నాథ్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను డిజేగా మారానని, హైదరాబాద్‌లో కూడా గతంలో డిజేగా పనిచేసిన అనుభవం తనకు ఉందని తెలిపారు. బ్యాంకాక్‌లో ఉన్నప్పుడు తెలుగు సినీ ప్రముఖులు తనను చూసి ఆశ్చర్యపోయేవారని, సినిమా రంగాన్ని వదిలేసి ఇలా డిజేగా మారారా అని అడిగేవారని బబ్లూ వెల్లడించారు.

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా

తన తల్లి ఆరోగ్య సమస్యల కారణంగా తిరిగి ఇండియాకు రావాల్సి వచ్చిందని చెప్పారు. ఓ టీవీ సీరియల్‌కు ఒప్పందం కుదిరినా, నిర్మాత కారణాల వల్ల అది రద్దైందని, అక్కడి నుంచి తన సినీ ప్రస్థానానికి మళ్లీ బ్రేక్ పడిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం బబ్లూ వినోద్ ఫిల్మ్ అకాడమీలో హెచ్ఓడీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త నటీనటులకు శిక్షణ ఇస్తూ, వారికి మార్గదర్శనం చేస్తున్నారు. ఇది కాకుండా, తన సొంత ప్రాజెక్టును కూడా ప్రారంభించినట్లు తెలిపారు. దాని వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. చిన్న చిన్న పాత్రలు చేసి పది సినిమాలు చేసే బదులు, ఒక్క మంచి పాత్ర చేసినా తనకు సంతృప్తిగా అనిపిస్తుందని పేర్కొన్నారు. డైరెక్టర్లకు వారి విజన్ ఉంటుందని, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ వంటి వారు తనను గుర్తుంచుకొని పాత్రలిచ్చిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.