Pawan Kalyan: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో. అందరి హీరోలకు అభిమానులుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు. పవన్ ఈ పేరు ఒక వైబ్రేషన్. ఈపేరు చెబితే అభిమానులు పూనకాలే. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఎ చిన్న విషయమైన ఫ్యాన్స్ కు ఆసక్తే.. ఇటీవల పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా (Anna Lezhneva ) రష్యాలో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ముందు భారత్ (Bharat)కు తిరిగి రాగా.. అనంతరం పవన్ భార్య అన్నా లెజినోవా తిరిగి భారత్ చేరుకున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పిక్స్ ఒకటి బయటకు వచ్చింది. ఈ పిక్ తెగ వైరల్ అయింది. పవన్ కళ్యాన్ తన భార్య అన్నా లెజినోవా సహా నలుగురు పిల్లలు కలిసి ఉన్న ఫ్యామిలీ గ్రూప్ ఫోటో. చూడ ముచ్చటగా కనులకు విందుగా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ఈ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ నలుగురు పిల్లలతో నవ్వుతూ సంతోషంగా ఉన్నాడు. మొదటి భార్య రేణూ దేశాయ్ కు పుట్టిన పిల్లల పేర్లు అకీరా నందన్, ఆద్యా. ఆ తరువాత పెళ్లి చేసుకున్న లెజినోవాకి పుట్టిన పాప పొలెనా అంజనా పవనోవా, తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెలు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోటో గత 10 రోజుల క్రితంది అయి ఉంటుంది.. ఎందుకంటే.. అకిరా నందన్ కు థర్డ్ వేవ్ లో కరోనా బారిన పడ్డాడు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు.
ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాన్ తాజాగా వరస సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పవన్ రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టిస్టారర్ మూవీ భిమ్లా నాయక్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. క్రిష్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న హరహర మల్లు షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది పట్టా లెక్కనున్నది. ఇప్పటికే సాంగ్స్ రెడీ అవుతున్నాయి. అంతేకాదు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రానికి కూడా పవన్ ఒకే చెప్పాడు. దీంతో 2022 క్యాలెండర్ పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ.
Also Read: ఈ రోజు ఈ రాశివారు స్త్రీవలన ధన లాభం పొందుతారు.. నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..