Tillu Square Trailer : టిల్లు అనేటోడు కారణజన్ముడు… అదిరిపోయిన టిల్లు స్క్వేర్ ట్రైలర్

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షోగా ఈ సినిమా తెరకెక్కింది. యూత్ ముఖ్యంగా ఈ సినిమాను తెగ ఆదరించారు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ , సాంగ్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా టిల్లు స్క్వేర్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్.

Tillu Square Trailer : టిల్లు అనేటోడు కారణజన్ముడు... అదిరిపోయిన టిల్లు స్క్వేర్ ట్రైలర్
Tillu Square Trailer

Updated on: Feb 14, 2024 | 7:09 PM

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నల గడ్డ హీరోగా నటిస్తున్న నయా మూవీ టిల్లు స్క్వేర్. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద విజయం సాదినిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షోగా ఈ సినిమా తెరకెక్కింది. యూత్ ముఖ్యంగా ఈ సినిమాను తెగ ఆదరించారు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ , సాంగ్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా టిల్లు స్క్వేర్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ట్రైలర్ ను విడుదల చేశారు.

టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్దూకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ సినిమాలో అనుపమ మునుపెన్నడూ కనిపించని గ్లామర్ లుక్ లో కనిపిస్తుంది. డీజే టిల్లు సినిమాలో ఓ అమ్మాయి చేతిలో మోసపోయి అనుకోని మర్డర్ కేసులో ఇరుక్కొని చివరకు సిద్దూ ఎలా తప్పించుకున్నాడో చూపించారు. ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్ విషయానికొస్తే..

ఈ సినిమాలో కూడా ఓ అమ్మాయి కారణంగా సిద్దూ ప్రాబ్లమ్స్ లో చిక్కుకుంటాడని తెలుస్తోంది. అంతే కాదు. అనుపమ, సిద్దు మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. డీజే టిల్లు మాదిరిగానే ఈ సినిమా కూడా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే సిద్దూ, అనుపమ మధ్య డీప్ లిప్ కిస్ సీన్ కూడా చూపించారు. ట్రైలర్ అయితే ఆసక్తికరంగా ఉంది.. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.