AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఇండస్ట్రీలోనే పరమ చెత్త సినిమా.. స్టార్ హీరోహీరోయిన్లు.. 45 కోట్లు పెడితే 60 లక్షలు వచ్చాయి..

సాధారణంగా కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం కామన్. భారీ అంచనాల మధ్య విడుదలై ఊహించని విధంగా డిజాస్టర్ అయిన ఓ సినిమా గురించి మీకు తెలుసా.. ? దాదాపు రూ.45 కోట్లు పెట్టి తీస్తే కనీసం రూ.60 లక్షలు కూడా రాలేదు. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరెంటో తెలుసుకుందామా.

Cinema : ఇండస్ట్రీలోనే పరమ చెత్త సినిమా.. స్టార్ హీరోహీరోయిన్లు.. 45 కోట్లు పెడితే 60 లక్షలు వచ్చాయి..
The Lady Killer Movie
Rajitha Chanti
|

Updated on: May 19, 2026 | 10:35 AM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తెరకెక్కించడం కామన్ అయ్యింది. స్టార్ హీరోల దగ్గర్నుంచి యంగ్ హీరోల వరకు అందరూ భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు భారీ బడ్జెట్, స్టార్ హీరోహీరోయిన్లతో రూపొందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు మాత్రం భారీ విజయాన్ని అందుకుంటాయి. మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలను తారుమారు చేసింది. 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఒక సినిమా కేవలం 60 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసి ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా నిర్మాతకు పెట్టిన పెట్టుబడిలో 0.0001% లాభాన్ని కూడా ఇవ్వలేదు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

ఆ సినిమా పేరు ‘ది లేడీ కిల్లర్’. 2023 నవంబర్‌లో హిందీలో విడుదలైంది. అజయ్ భాయ్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ భారీ హైప్ మధ్య తెరకెక్కించారు. అయితే విడుదలైన మొదటి రోజు ఈ మూవీ భారతదేశం అంతటా కేవలం 293 టిక్కెట్లను మాత్రమే అమ్ముడయ్యాయి. ది. రూ. 45 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని, విస్తృతమైన ప్రచారం లేకపోవడం వల్ల మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం 12 స్క్రీనింగ్‌లలో మాత్రమే ప్రదర్శించారు. సినిమా కథనం, అక్కడక్కడ సీన్స్ ఆగిపోవడం, క్లైమాక్స్ అర్థంకాకపోవడం వల్ల సినిమా ఆకట్టుకోలేకపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..

అయితే ప్రారంభంలో, నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. కానీ సినిమా చూసిన తర్వాత, ఓటీటీ విడుదలను విరమించుకుంది. ఏ ఓటీటీ కంపెనీ కూడా ఈ సినిమాను కొనడానికి ముందుకు రాకపోవడంతో, చిత్ర బృందం ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఇప్పటికీ ఈ సినిమా దారుణమైన రికార్డ్ నమోదు చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

Follow Us
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!