The Legend: తన సినిమా అందుకే ఓటీటీలో రాలేదట.. అసలు విషయం చెప్పిన శరవణన్

ఐదు పదుల వయసు మీదపడిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు శరవణన్. తొలి సినిమానే పాన్ ఇండియా మూవీగా తీసుకు వచ్చాడు. గతంలో ఆయన తన శరవణన్ స్టోర్స్ యాడ్స్ లో తానే నటించారు.

The Legend: తన సినిమా అందుకే ఓటీటీలో రాలేదట.. అసలు విషయం చెప్పిన శరవణన్
Saravanan The Legend

Updated on: Oct 23, 2022 | 7:22 AM

లెజెండ్ శరవణన్ ఈ పేరు మొన్నటి  వరకు సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరు. శరవణన్ స్టోర్స్ అధినేత శరవణన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఐదు పదుల వయసు మీదపడిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు శరవణన్. తొలి సినిమానే పాన్ ఇండియా మూవీగా తీసుకు వచ్చాడు. గతంలో ఆయన తన శరవణన్ స్టోర్స్ యాడ్స్ లో తానే నటించారు. స్థార్ హీరోయిన్స్ తో కలిసి శరవణన్ తన బ్రాండ్ కు ప్రమోషన్స్ చేసేవారు. ఇక ఇప్పుడు ఆయన ఏకంగా హీరో అవతారమెత్తాడు. శరవణన్ హీరోగా ది లెజెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్ లో శరవణన్ స్వీయ నిర్మాణంలో ”ది లెజెండ్” అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు జీడీ-జెర్రీ దర్శకత్వం వహించారు.  భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కోసం పాపులర్ స్టార్స్ , టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు.

‘ది లెజెండ్’ చిత్రాన్ని జూలై 28న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాలో ఏకంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్న ఓటీటీకి మాత్రం రావడం లేదు.

అయితే రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత ఈ మూవీకి పలు ఓటీటీల నుండి మంచి ఆఫర్స్ వచ్చినా కానీ ‘నో’ చెబుతున్నాడట శరవణన్.. “ది లెజెండ్’ అనే సినిమాను నేను ఎంతో ఇష్టపడి తీశాను. నేను నటించి, నిర్మించిన ఈ క్లాసిక్ మూవీ చాలా ఈజీగా అందరికీ అందుబాటులో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు’ అని చెప్పారట. దాంతో నెట్టింట మరోసారి ఈ సినిమా గురించి, హీరో గురించి ట్రోల్స్ చేస్తున్నారు కొందరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి