
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా సైంధవ్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. వెంకీ కెరీర్లో 75వ సినిమాగా వస్తుంది ఈ యాక్షన్ ఎంటర్టైనర్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అలాగే హిట్ 1, 2 చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్ట్ర సైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తుండడంతో ఈమూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. నటుడిగా 75 సినిమాలు విజయవంతంగా పూర్తిచేసుకుంటున్నారు వెంకీ. ఈ సందర్భంగా ఈరోజు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు సైంధవ్ చిత్రయూనిట్. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ‘వెంకీ 75’ ఈవెంట్ జరగనుంది.
దగ్గుబాటి వారసుడు.. పాన్ ఇండియా హీరో రానా ఈ ఈవెంట్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. 1986లో కలియుగ పాండవులు సినిమాతో తెరంగేట్రం చేశారు వెంకీ. మొదటి సినిమాతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. దివంగత నిర్మాత రామానాయుడి వారసుడిగా సినీ అరంగేట్రం చేసిన వెంకీ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఓ హీరోకు 75వ చిత్రానికి ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి.
Ok let’s celebrate #Venky75 in a grand way💥💥💥
Maawa @etvwin neeku comfort ye kadaa🤗
Follow these steps & win your GOLD Passes 👍🏻#CelebratingVenky75withYouWeMedia
Victory @VenkyMama @NiharikaEnt @MediaYouwe #Saindhav #SaindhavOnJan13th pic.twitter.com/weHCLBzIey
— YouWe Media (@MediaYouwe) December 26, 2023
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్, నాగార్జున సహా మరికొంత మంది హీరోస్ హాజరవుతారని తెలుస్తోంది. అంతేకాకుండా యంగ్ హీరోస్ కూడా చాలా మంది వస్తారని టాక్. కలియుగ పాండవులు నుంచి ఇప్పటి సైంధవ్ సినిమా వరకు వెంకీతో కలిసి నటించిన నటీనటులు సైతం ఈ వేడకకు రాబోతున్నారని తెలుస్తోంది. డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నిషియన్స్ రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. చాలా కాలం తర్వాత టాలీవుడ్ సీనియర్ స్టార్స్, డైరెక్టర్స్, నటీనటులు అంతా ఒక్కచోట చేరనున్నారు.
The stars will align on one stage tomorrow to celebrate everyone’s favourite @VenkyMama👌🌟♥️
From 5PM onwards at JRC Conventions, Hyd 🔥#Venky75#SAINDHAV #SaindhavOnJan13th pic.twitter.com/ziGUkU2X6b
— Lipika (@xoxolipika) December 26, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.