Cinema : సంక్రాంతికి సినిమాల జాతర.. థియేటర్లు ఫుల్లు.. ఓటీటీలో వచ్చే చిత్రాలు ఇవే..

సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ఇప్పటికే జనాలు పట్నం విడిచి పల్లె బాట పట్టారు. తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి గ్రాండ్ గా ఫెస్టివల్ ఎంజాయ్ చేయనున్నారు. మరోవైపు తెలుగు బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే సంక్రాంతి పండగ సందడి స్టార్ట్ అయ్యింది. జనవరి 9న విడుదలైన రాజాసాబ్ సినిమా మిశ్రమ టాక్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పుడు మరిన్ని చిత్రాలు అలరించనున్నాయి.

Cinema : సంక్రాంతికి సినిమాల జాతర.. థియేటర్లు ఫుల్లు.. ఓటీటీలో వచ్చే చిత్రాలు ఇవే..
Sankranti Movies

Updated on: Jan 11, 2026 | 4:48 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ సందడి మొదలైంది. అలాగే అటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా సంక్రాంతి సినిమాల జాతర షూరు అయ్యింది. ఇప్పటికే ఈ ఫెస్టివల్ వైబ్ తీసుకువస్తూ జనవరి 9న థియేటర్లలో విడుదలైంది రాజాసాబ్. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఇప్పుడు మరిన్ని సినిమాలు సైతం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. అలాగే థియేటర్లతోపాటు ఓటీటీలోనూ పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటేస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

అలాగే ఎప్పటిలాగే మాస్ మహరాజా రవితేజ సైతం ఈ పండక్కి థియేటర్లలో ప్రేక్షకులను అలరించనున్నారు. డైరెక్టర్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించగా.. జనవరి 13న ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

ఇవే కాకుండా జాతిరత్నాలు సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి సైతం ఈసారి పండక్కి అలరించనున్నారు. గౌరవపురం జమీందార్ గోపరాజు మనవడు రాజు పాత్రలో సంక్రాంతికి నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా వస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

అలాగే శర్వానంద్ హీరోగా నటించిన మూవీ నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. మాజీ ప్రేయసి, ప్రస్తుత లవర్ మధ్య నలిగిపోయే యువకుడి కథలో శర్వానంద్ కనిపించనున్నారు. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య నటిస్తున్నారు.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు..

జియో హాట్ స్టార్..

ఇండస్ట్రీ 4.. వెబ్ సిరీస్.. జనవరి 11

జీ5..

భా.. భా.. భా.. మలయాళం.. జనవరి 16

గుర్రం పాపిరెడ్డి.. తెలుగు సినిమా.. జనవరి 16

అమెజాన్ ప్రైమ్..

నైట్ మేనేజర్ 2.. వెబ్ సిరీస్.. జనవరి 11

బ్యాంక్ ఆఫర్ భాగ్యలక్ష్మి.. కన్నడ.. జనవరి 12

120 బహదూర్.. హిందీ.. జనవరి 16

నెట్ ఫ్లిక్స్..

తస్కరీ.. హిందీ సిరీస్.. జనవరి 14

అగాథా క్రిస్టీ సెనెన్ డయల్స్.. వెబ్ సిరీస్.. జనవరి 14

ది రిప్.. మూవీ.. జనవరి 16

సోనీలివ్..

కాలమ్ కావల్.. మలయాళం.. జనవరి 16

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..