Tollywood: ఈ సంక్రాంతికి పోటీ మాములుగా లేదుగా.. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Tollywood: ఈ సంక్రాంతికి పోటీ మాములుగా లేదుగా.. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే..!
Mahesh Babu, Nagarjuna

Updated on: Aug 30, 2023 | 9:34 AM

ఈసారి సంక్రాంతికి సాలిడ్ ఫైట్ జరగనుంది. వచ్చే ఏడాది జనవరిన ఈసారి బడా సినిమాలు రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఈగల్ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది.

రవితేజ ఈసారి మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో రానున్నాడు.  అలాగే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వన్ హీరోయిన్‍గా నటిస్తుందని టాక్. ఇక తేజ సజ్జ హీరోగా నటిస్తున్న హనుమాన్ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సూపర్ హీరోగా కనిపించనున్నాడు.

నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో ఆయన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు నా సామిరంగా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున మాస్ మసాలా పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని తెలుస్తోంది.

మహేష్ బాబు ట్విట్టర్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..