
కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వనున్నాం.. ప్రపంచం మొత్తం కొత్త ఏడాది సంబరంగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. అలాగే మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండగ కూడా రానుంది. ఇక ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతికి ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా, చిరంజీవి, వెంకటేష్ నటిస్తున్న మన శంకర ప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఓ రాజు, రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఈ వారం సైక్ సిద్దార్థ్, ఫెయిల్యూర్ బాయ్స్, ఇట్స్ ఒకే గురు, ఇక్కిస్, ఘంటశాల, నీలకంఠ వంటి సినిమాలు థియేటర్స్ లో విడుదల కానున్నాయి.
అలాగే ఈ వారం కొన్ని సినిమాలు రీ రిలీజ్ కూడా కానున్నాయి. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా ఈ వారం ఓటీటీలోనూ రకరకాల సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి.
ఇక ఈ వారం ఓటీటీలో అలరించనున్న సినిమాల విషయానికొస్తే..
1. ఎకో- డిసెంబరు 31
2.స్ట్రేంజర్ థింగ్స్ 5 (తెలుగు డబ్బింగ్) జనవరి 1
3. లుపిన్ 4 (వెబ్‌సిరీస్) జనవరి 01
4. హక్ (హిందీ) జనవరి 02
5. సీగే మీ వోస్ జనవరి 02
6. ది కోపెన్‌హెగెన్ టెస్ట్ స్ట్రీమింగ్ అవుతోంది
7. ఇతిరి నేరమ్ డిసెంబరు 31
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.