‘తెల్లారితే గురువారం’ అంటున్న కీరవాణి కొడుకు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్..

|

Feb 12, 2021 | 2:34 AM

'మత్తు వదలరా' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు శ్రీసింహా. ఈ యంగ్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు అనే విషయం అందరికి తెలిసిందే...

తెల్లారితే గురువారం అంటున్న కీరవాణి కొడుకు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్..
Follow us on

Thellavarithe Guruvaram : ‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు శ్రీసింహా. ఈ యంగ్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు అనే విషయం అందరికి తెలిసిందే. ఇదే సినిమాతో కీరవాణి మరో తనయుడు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ‘తెల్లారితే గురువారం’ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది.

ఈ సినిమాతో మణికాంత్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం – లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి – రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నట్లు చిత్ర బృందం గురువారం ప్రక‌టించింది. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఒక హీరోయిన్ పెళ్లి కూతురు గెటప్ లో కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా.. పక్కనే పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న హీరో ఒళ్ళో మరో హీరోయిన్ కూర్చొని కనిపిస్తోంది. కారులోని మిర్రర్‌కు డాక్టర్లు ఉప‌యోగించే స్టెత‌స్కోప్ ఉండ‌టం ఇంకో విశేషం. ఈ పోస్టర్ చూస్తుంటే శ్రీసింహా మరో వైవిధ్యమైన సినిమాతో వస్తున్నారని అర్థమవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

విడుదలకు సిద్దమవుతున్న నితిన్ చెక్ మూవీ… సినిమా నైజాం హక్కులను దక్కించుకుంది ఎవరో తెలుసా..?