The Warriorr Twitter Review: ది వారియర్ ట్విట్టర్ రివ్యూ.. రామ్ పోతినేని మెప్పించాడా ?..

|

Jul 14, 2022 | 10:47 AM

మరో హీరో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా..

The Warriorr Twitter Review: ది వారియర్ ట్విట్టర్ రివ్యూ.. రామ్ పోతినేని మెప్పించాడా ?..
The Warriorr
Follow us on

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రధాన పాత్రలో తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించిన సినిమా ది వారియర్ (The Warriorr). ఇందులో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా.. కృతి శెట్టి కథానాయికగా నటించింది. మరో హీరో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా.. పాటలకు నెట్టింట అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఇక ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి సారి పోలీస్ పాత్రలో కనిపించిన రామ్ ప్రేక్షకులను మెప్పించాడా ? లేదా ? అనేది తెలుసుకుందామా.

ది వారియర్ బాగుందని.. మాస్ రైడ్ సినిమా అని 4/5 రేటింగ్ ఇవ్వొచ్చు అంటూ ట్వీట్ చేస్తున్నారు.

ది వారియర్ రాపో వన్ మ్యాన్ షో. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. విజిల్ వేయడానికి తగినన్ని సన్నివేశాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత సరైన మాస్ సినిమా అంటూ ట్వీట్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.