
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు రెండోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధి పద్ధతిలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియాలో షేర్ వెల్లడించింది. దీంతో సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు సినీప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు కొందరు సెలబ్రెటీలు మాత్రం పరోక్షంగా సమంత పెళ్లి పై పోస్టులు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..
“సొంత గూడు కట్టుకోవడానికి మరొకరు ఇంటిని పడగొట్టడం బాధాకరం” అంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. ఆమె ఎవరిని ఉద్దేశించి చేశారనే స్పష్టత లేకపోయినప్పటికీ సమంత పెళ్లి తర్వాత రావడంతో ఆమె గురించే అంటూ నెట్టింట చర్చ జరిగింది. ఇక ఇప్పుడు సమంత మాజీ పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ సైతం చేసిన పోస్ట్ సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “బాధితురాలిగా విలన్ బాగా నటించింది” అంటూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టడం.. ఆ వెంటనే సమంతను అన్ ఫాలో చేయడం నెట్టింట చర్చగా మారింది. గతంలో సద్నా, సమంత మధ్య మంచి స్నేహం ఉండేది.
ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..
ఏమాయ చేసావే సినిమాతో తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసిన సమంత.. ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఒంటరిగా ఉన్న సమంత.. ఇప్పుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారు. రాజ్ గతంలో శ్యామలీతో వివాహం జరిగింది. వీరికి పిల్లలు ఉన్నారు. కానీ ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.
SadhnaSingh
Samantha's Partner In Crime And Her Personal Make Up Stylist Unfollowed Sam On Instagram And Posted This Story Today https://t.co/HBWekuC1Bm pic.twitter.com/LUtfdg5c3U
— Thandel Raju ⚓🌊❤️ (@PurnaMaaya_) December 1, 2025
ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?