Nani 30: నాని నయా మూవీ టైటిల్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

|

Jul 13, 2023 | 12:10 PM

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో ఇంట్రెస్టున్గ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని.

Nani 30: నాని నయా మూవీ టైటిల్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Nani 30
Follow us on

నేచురల్ స్టార్ నాని సినిమా కోసం ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా దసరా సినిమాతో నాని సూపర్ హిట్ అందుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో ఇంట్రెస్టున్గ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. ఈ సినిమా నాని కెరీర్ లో 30వ సినిమా. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే శ్రుతిహాసన్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో నాని తండ్రి పాత్రలో నటిస్తున్నారు

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఈ మూవీ గ్లింమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ ను ఖరారు చేశారు. నాని సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజే చేశారు. ఈ పోస్టర్  ఆసక్తికరంగా ఉంది.

ఈ పోస్టర్ లో నాని తన కూతురిని భుజాలపై ఎక్కించుకొని ఉండగా ఆ పాప మృణాల్ నాకు ఫ్లలింగ్ కిస్ ఇస్తూ కనిపించింది. ఈ సినిమాకు శౌర్యవ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. నాని గతంలో జెర్సీ సినిమాలోనూ ఓ పిల్లోడికి తండ్రిగా నటించాడు. ఇప్పుడు మరోసారి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.